Russia-Ukraine War: కీవ్ నగరాన్ని అత్యవసరంగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. ఏం జరగబోతోంది?

'ఇన్ని రోజులూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క'' అర్ధరాత్రి లోగా యుక్రెయిన్ రాజధాని కీవ్ ను వదిలేసి వచ్చేయాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం తెగేసి చెప్పింది. ఈ మేరకు ప్రధాని సైతం వెంటనే.

Russia-Ukraine War: కీవ్ నగరాన్ని అత్యవసరంగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. ఏం జరగబోతోంది?

Kyiv Capital

Russia-Ukraine War: ”ఇన్ని రోజులూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క” అర్ధరాత్రి లోగా యుక్రెయిన్ రాజధాని కీవ్ ను వదిలేసి వచ్చేయాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం తెగేసి చెప్పింది. ఈ మేరకు ప్రధాని సైతం వెంటనే తరలి రావాలని, దీని కోసం ఎయిర్‌ఫోర్స్ సైతం కదిలొచ్చి ఆపన్న హస్తం అందించాలని కోరారు.

ఎయిరిండియా విమానంలో 250 మంది వరకూ తీసుకొచ్చే వీలుండగా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 విమానంలో ఒకేసారి 1000మందిని తీసుకురావొచ్చు. ఇన్ని రోజులుగా ఎయిరిండియాతో తరలింపు కార్యక్రమం చేపడుతున్న ఇండియా ఒక్కసారిగా కీవ్ ను ఖాళీ చేసి వచ్చేయండి. ఇకపై అక్కడుండేందుకు వీలు లేదని చెప్పడం వెనుక కారణమేమై ఉండొచ్చు.

యుద్ధం మొదలుకాకముందే ఇండియన్ ఎంబస్సీ స్టూడెంట్లను వెళ్లిపోవాలని సూచించింది. చెప్పినట్లుగానే యుద్ధం మొదలుకావడంతో ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఖరాఖండిగా అర్ధరాత్రిలోగా వెళ్లిపోవాలని చెప్పడం వెనుక ఇంకా బలమైన దాడి ఏదైనా జరుగుతుందా… ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడం వల్లనే ఇలాంటి సూచనలిస్తున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Read Also : యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై పంజా విసురుతున్న రష్యా

అసలు దాడికి కీవ్ నగరాన్నే ఎంచుకోవడానికి కారణమేమై ఉండొచ్చు. దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన నగరాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటైన కీవ్.. ఇప్పుడు రష్యా దాడులకు చిగురాటకులా వణికిపోతుంది. దాడులను ఎదుర్కొంటూ ఆర్మీ బలగాలే కాకుండా యుక్రెయిన్ సాధారణ పౌరులు సైతం ఆయుధాలు పట్టుకుని యుద్ధంలో పాల్గొంటుండగా అల్లర్లతో ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

యుక్రెయిన్‌ ఆర్మీ ప్రజలను ఓ షీల్డ్‌లా ఉపయోగించుకుంటూ రష్యన్‌ ఆర్మీపై దాడులు చేస్తోందనేది రష్యా ఆరోపణ. అందుకే ప్రజలను కీవ్‌ను వదిలి వెళ్లాలంటూ సూచించింది. సాధారణ ప్రజలపై రష్యా ఎలాంటి దాడులు చేయదని ప్రకటించింది. దీంతో ఇక ఆర్టిలరీ గన్‌లు కీవ్‌లో ప్రజలు నివసించే ప్రాంతాలపై టార్గెట్‌ చేసేందుకు రెడీ అయ్యినట్టే చెప్పాలి.

వాతావరణం రీత్యా జనవరి – ఫిబ్రవరి మధ్య -4.6 డిగ్రీల నుంచి -1.1 డిగ్రీల మధ్య ఉండే కీవ్.. నవంబర్ నుంచి మార్చి వరకూ మంచుతో కప్పబడి ఉండి అత్యంత సుందరమైన నగరంగా చెప్పుకునే కీవ్‌లో భవంతులు కూడా ఐరోపా నాగరికతతో కనిపిస్తుంటాయి. రష్యా బలగాలు చేస్తున్న దాడులకు ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. ఆర్తనాదాలు, విప్లవ జ్వాలలతో వేడెక్కిపోయింది.