Russia : యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై పంజా విసురుతున్న రష్యా

రష్యా మొదట వేసుకున్న ప్రణాళికల ప్రకారం కీవ్‌ ఇప్పటికే హస్తగతం కావాలి.. కానీ యుక్రెయిన్‌ ఆర్మీ నుంచి ఊహించని విధంగా ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా అది జరగలేదు.

Russia : యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై పంజా విసురుతున్న రష్యా

Kyiv

Russia attack Kyiv : యుక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఓ వైపు చర్చలు అంటూనే చేయాల్సిందంతా చేస్తున్నారు. బెలారస్‌ సరిహద్దుల్లో యుక్రెయిన్‌ పెద్దలతో ముచ్చట్లు పెడుతూనే.. కీవ్‌పై కత్తులు నూరుతున్నారు. నిన్న రష్యా-యుక్రెయిన్‌ మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు.. అలా అని విఫలం కూడా కాలేదు. మరోసారి చర్చలు జరుపుతామని మాత్రం ప్రపంచానికి అనౌన్స్‌ చేశాయి ఇరు పక్షాలు.

లోపల ఏం చర్చించారన్నది మాత్రం బయటికి చెప్పలేదు. దీంతో చర్చలకు సై అంటూనే మరోవైపు చేయాల్సిందంతా చేస్తోంది రష్యా. కీవ్‌వైపు చీమల బారుల్లా రష్యా యుద్ధ వాహనాలు తరలివస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధ వాహనాల కాన్వాయ్‌ ఒకటి రెండు కిలోమీటర్లు కాదు. ఏకంగా 64 కిలోమీటర్ల పొడువున్న రష్యన్‌ ఆర్మీ కాన్వాయ్‌ కీవ్‌వైపు దూసుకొచ్చినట్టు అమెరికన్‌ శాటిలైట్లు గుర్తించాయి.

Cooking Oil Prices : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు

రష్యా మొదట వేసుకున్న ప్రణాళికల ప్రకారం కీవ్‌ ఇప్పటికే హస్తగతం కావాలి.. కానీ యుక్రెయిన్‌ ఆర్మీ నుంచి ఊహించని విధంగా ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా అది జరగలేదు.. నాటో దేశాలు ఇస్తున్న ఆయుధాలు.. ధైర్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న యుక్రెయిన్‌ ఆర్మీ ధీమాను చూస్తుంటే ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దీంతో రష్యా దాడులు తగ్గించింది.. రష్యా బలగాలు వెనక్కి తగ్గాయన్న వార్తలు వినిపించాయి. కానీ వెనకడుగు వేసింది మరింత దూకుడుగా దూసుకుపోవడానికే అని ఇప్పుడు అర్థమవుతోంది.

ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు పుతిన్‌. అందుకే ఇకపై జనావాసాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకోతున్నారు. ప్రజలంతా కీవ్‌ను వదిలి వెళ్లాలంటూ రష్యా చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే రష్యన్‌ ఆర్మీ దాడులను తీవ్రతరం చేసేందుకు డిసైడైనట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. దీనికి బలం చేకూర్చేలా అమెరికా శాటిలైట్లు 64 కిలోమీటర్ల పొడవైన రష్యన్‌ ఆర్మీ కాన్వాయ్‌ను గుర్తించాయి.

Indo Ukrainian couple : యుక్రెయిన్‌ అమ్మాయిని పెళ్లాడిన హైదరాబాదీ అబ్బాయి.. రిసెప్షన్ ఎక్కడంటే?

యుక్రెయిన్‌ ఆర్మీ ప్రజలను ఓ షీల్డ్‌లా ఉపయోగించుకుంటూ రష్యన్‌ ఆర్మీపై దాడులు చేస్తోందనేది రష్యా ఆరోపణ. అందుకే ప్రజలను కీవ్‌ను వదిలి వెళ్లాలంటూ సూచించింది. సాధారణ ప్రజలపై రష్యా ఎలాంటి దాడులు చేయదని ప్రకటించింది. దీంతో ఇక ఆర్టిలరీ గన్‌లు కీవ్‌లో ప్రజలు నివసించే ప్రాంతాలపై టార్గెట్‌ చేసేందుకు రెడీ అయ్యినట్టే చెప్పాలి.

అంతేగాకుండా రష్యన్‌ ఆర్మీపై పోరాటం కోసమని ఆయుధాలు పొందిన యుక్రెయిన్‌ ప్రజలు వాటిని దొంగతనాలు, దోపిడిలకు ఉపయోగిస్తున్నారని మరో ఆరోపణ చేసింది. యుక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించింది. ఇక తమను అడ్డుకోలేరన్నట్టుగా ఓ ప్రకటనను వెలువరించింది.

Russia Ukraine Conflict : ఆగని రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. 352 మంది మృతి.. 14 మంది చిన్నారులే..!

మరోవైపు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ దేశంలోని యుద్ధ అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తానని ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 4వేల 500 మంది రష్యా సైనికులను మట్టుపెట్టామని.. మిగిలిన వారు కూడా తమ దేశానికి వదిలివెళ్లి ప్రాణాలు రక్షించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు.