Russia Ukraine Conflict : ఆగని రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. 352 మంది మృతి.. 14 మంది చిన్నారులే..!

Russia Ukraine Conflict : యుక్రెయిన్-రష్యా యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు.

Russia Ukraine Conflict : ఆగని రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. 352 మంది మృతి.. 14 మంది చిన్నారులే..!

Russia Ukraine Conflict 352 Ukrainian Civilians Killed, 1,684 Injured (2)

Russia Ukraine Conflict : యుక్రెయిన్-రష్యా యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. తన బలగాలను వెనక్కి పిలవడం లేదు. అంతే దూకుడుగా కీవ్ నగరంలోకి తన రష్యా బలగాలను పురిగొల్పుతున్నాడు. రష్యా దాడులను దీటుగా ప్రతిఘటిస్తున్న యుక్రెయిన్ సైన్యం కూడా ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రువులను తరిమికొట్టేంత వరకు వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా వీరోచితంగా పోరాడుతోంది.

ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుక్రెయిన్-రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది. రష్యా వదిలిన క్షిపణుల దాడుల్లో అనేక మంది యుక్రెయిన్లు ప్రాణాలు కోల్పోయారు. రష్యా క్షిపణలు యుక్రెయిన్ లోని భవనాల్లోకి దూసుకెళ్లి వందలాది మంది ప్రాణాలను తీశాయి. ఇప్పటివరకూ రష్యా జరిపిన దాడిలో మొత్తం 1,684 మంది తీవ్రంగా గాయపడగా.. 352 మంది యుక్రెయిన్ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  వారిలో 14 మంది చిన్నారులే ఉన్నారని యుక్రెయిన్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

Russia Ukraine Conflict 352 Ukrainian Civilians Killed, 1,684 Injured (1)

Russia Ukraine Conflict 352 Ukrainian Civilians Killed, 1,684 Injured

యుద్ధం కారణంగా పసిప్రాణాలు గాల్లో కలిచిపోతున్నాయి. యుక్రెయిన్ లోని అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నోలో 11 మంది పౌరులు చనిపోయినట్టు ధ్రవీకరించింది. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 50 లక్షల మంది
ప్రాణభయంతో దేశ పౌరులు యుక్రెయిన్ విడిచి సురక్షత ప్రాంతాలకు తరలిపోయారని యూఎన్ నివేదిక వెల్లడించింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ ఉత్తరాన రష్యా సైన్యం 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు యూఎన్ శాటిలైట్ ఫొటోల్లో రికార్డు
అయ్యాయి.

ఒకవైపు యుక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు రెండు దేశాల మధ్య శాంతిపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయితే దాడులకు బ్రేక్ ఇచ్చిన రష్యాతో చర్చలు విఫలమయ్యాయి. ఈ రోజు
నుంచి మళ్లీ రష్యా దాడులకు పాల్పడుతోంది.

తమ దేశ డిమాండ్లకు లొంగిపోతేనే యుద్ధాన్ని ఆపేది అన్నట్టు పుతిన్ సేన కీవ్ నగరంలోకి లోపలికి దూసుకోస్తోంది. తమ డిమాండ్లకు తలొగ్గేంతవరకు దాడులు ఆపేది లేదని రష్యా తేల్చి చెప్పేసింది. మరోవైపు.. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ రష్యా బలగాలను 3,500 మందిని చంపేసినట్టు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.

Read Also : Russia Ukraine War: రష్యాను ఎదిరించిన 100 మంది యుక్రెయిన్ వీరులు