Eluru Ganganamma Jatara: 3 నెలలు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు నిషేధం.. ఆశ్చర్యపరిచే గంగానమ్మ జాతర కట్టుబాట్లు, ఆచారాలు..
నగరం అంతటా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. గంగానమ్మ అమ్మవారు గడప గడపకు ఊరేగుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.
Eluru Ganganamma Jatara: అదొక జాతర. జస్ట్ జాతర అంటే సరిపోదు. ఆ జాతర ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయం గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. జాతర జరిగే 3 నెలల పాటు ప్రజలెవరూ పండుగలు చేసుకోరు. శుభకార్యాలు చేయరు. పెళ్లిళ్లు కూడా చేసుకోరు. గంగానమ్మ జాతర జరిగే మూడు నెలలు వీటిపై నిషేధం ఉంటుంది. అసలేంటీ గంగానమ్మ జాతర, ఎక్కడ జరుగుతుంది, జాతరలో పాటించే ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయం ఏంటి? తెలుసుకుందాం..
గంగానమ్మ జాతర.. ఏలూరులో జరుగుతున్న పడమర వీధి గంగానమ్మ జాతరకు ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఎన్నో కట్టుబాట్లు, మరెన్నో ఆచారాలు ఉంటాయి. ఏడేళ్ల తర్వాత గంగానమ్మ జాతర ప్రారంభమైంది. మూడు నెలల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 2న ముగుస్తుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ జాతరలో పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు 3 నెలల పాటు నిషేధం. అంతేకాదు కొత్త దుస్తులు ధరించరాదు. గంగానమ్మ జాతర సందర్భంగా ఈసారి సంక్రాంతి పండగ కూడా ఏలూరు ప్రజలకు దూరం కాబోతోంది.
3 నెలలు పండుగలు, శుభకార్యాలు బంద్..
ఏడేళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే గంగానమ్మ జాతర చాలా ఫేమస్. ఏలూరు చుట్టుపక్కల ప్రజలు జాతరను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర సందర్భంగా 3 నెలలు ఏలూరు నగరంలో శుభకార్యాలు నిర్వహించరు. పెళ్లిళ్లు కూడా వాయిదా వేస్తారు. జాతర సమయంలో అమ్మవారు నగర సంచారం చేస్తారు. తూర్పు వీధి, పడమర వీధులలో ప్రధానంగా గంగానమ్మ ఆలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఆ రెండు ఆలయాల్లోనూ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరులో గ్రామదేవతలు కొలువుదీరిన ప్రతిచోట జాతర మహోత్సవాలు నిర్వహిస్తుంటారు.
ముఖ్యంగా ఆది మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల జాతర జరపడం ఆచారం. ముడుపు కట్టడం, మేడల వద్దకు తీసుకురావడం, కొర్లబండి వేయడం, కుంభం పోయడం, సాగనంపడం జాతరలోని ముఖ్యఘట్టాలు. జాతర సందర్భంగా కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం సందడిగా మారుతుంది. మహాకుంభం సమర్పించే రోజున పెద్దఎత్తున అన్నపురాశిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. ఏడేళ్ల తర్వాత ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర జరుగుతోంది. ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటారు.
96 రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమం…
గంగానమ్మ జాతరతో ఏలూరు నగరం అంతటా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. శ్రీశ్రీశ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. గంగానమ్మ అమ్మవారు గడప గడపకు ఊరేగుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. అమ్మవారికి భక్తులు పసుపు నీళ్లతో స్వాగతం పలుకుతున్నారు. 96 రోజుల పాటు జరిగే జాతర కార్యక్రమంలో సగం రోజులు పూర్తయ్యాయి.
జాతరలో ముఖ్యమైన ఘట్టాలు..
* నవంబర్ 5న నగర సంచారం
* నవంబర్ 8న మేడలలో అమ్మవార్ల ప్రవేశం
* జనవరి 31న కొర్ల బండి ఊరేగింపు
* ఫిబ్రవరి 1న మహా కుంభ నివేదన
* ఫిబ్రవరి 2న లక్షలాది మంది భక్తులతో ఊరేగింపు
* కొర్ల బండిలో పంబాలమ్మను సాగనంపుతారు
* ఒకే చెట్టు వేప కర్రతో ఇనుప మేకు లేకుండా కొర్ల బండి తయారీ
* మూడు నెలలు అమ్మవారిని కొలుస్తారు
* 101 అక్క దేవతలను కొలుస్తారు
* వంగాయగూడెం సెంటర్ ఆది మహాలక్ష్మి గుడిలో వేప చెట్టుకి ముడుపు కట్టాక అమ్మవారి జీవిత చరిత్ర చెబుతారు
* ముడుపు అయిపోగానే దక్షిణ వీధిలో శెనగపప్పు బజార్ లో మేడల దగ్గర పందిరాటు వేస్తారు
* గంగానమ్మ, పోతురాజు, మహాలక్ష్మమ్మ భూమ్మీద పాదం మోపి మూడు రాత్రులు, నాలుగు పగళ్లు అమ్మవారు నగర సంచారం చేస్తారు
* అమ్మవార్లు మేడల్లోకి ప్రవేశించాక భక్తులు దర్శనానికి వస్తారు
* పాల పొంగలి, చనివిడి వడపప్పు, పానకాలు సమర్పిస్తారు
* జనవరి 8న నల్లమారి అమ్మవారు వస్తారు.
* ఫిబ్రవరి 2న అమ్మవారిని సాగనంపటం
* మహాలక్ష్మమ్మ తల్లిని, అంకమ్మ తల్లిని యథాస్థానంలో పెడతారు
* గంగానమ్మను, పోతురాజు బాబును, 18 మంది అక్క దేవతలను కొర్ల బండిలో పెట్టి నగర సంచారం
* వేప చెట్టుకి ఒక్క మేకు కూడా కొట్టరు. వేప పుల్లనే మేకు శిలగా వాడి రథం తయారు చేస్తారు
* ద్వార పాలకులు ఎలా ఉంటారో అలాగే ఊరిని కాసేందుకు అక్క దేవతలు ఉంటారు. ఊరిలోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా కాపాడండని కోరతారు.
* గ్రామ దేవతను రోడ్డు మీదకు తీసుకొస్తాం. కాబట్టి గ్రామ దేవతకు ఎక్కువ విలువ ఇచ్చి ఈ మూడు నెలలు కొలుచుకుంటే, ఎటువంటి వ్యాధులు రావు.
* హేలాపురిని పాలించిన రాజులు కూడా ఇదే విధానం పాటించారు. అప్పుడు ధాన్య రాశులు పోసేవారు. ఇప్పుడు కుంభాన్ని పోస్తున్నాం. 3 లారీల పైనే కుంభం పోస్తారు.
* ఈ 3 నెలలు పుట్టిన రోజు చేసుకోకూడదు, కొత్త బట్టలు కొనరాదు, పెళ్లిళ్లు చేసుకోరు, గృహ ప్రవేశాలు ఉండవు,
Also Read: రాహుకేతువుల వల్ల ఈ వ్యాధులు వచ్చేస్తాయ్.. అకస్మిక మరణం
