రాహుకేతువుల వల్ల ఈ వ్యాధులు వచ్చేస్తాయ్.. అకస్మిక మరణం
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
రాహువు వాయుతత్వ కారకుడు కాబట్టి మన శరీరంలోని వాయుసంబంధ వ్యాధులను కలుగజేస్తాడు. కడుపునొప్పి, కాళ్లనొప్పులు, జీర్ణక్రియ సరిగ్గా లేకుండుట, ఉదర సంబంధ వ్యాధులు టైఫాయిడ్, మలేరియా, వైరస్ జ్వరములు మశూచి, రాహువు, శుక్రులు కలిస్తు చర్మ వ్యాధులు, రాహువు కన్యా రాశిలో ఉంటే కడుపులో పురుగులు చేరుతాయి.
రాహువు పరిస్థితిని బట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించి బ్యాక్టీరియా క్రిములను ఆహ్వానించును. నడుము నొప్పి, పక్షవాతం, కీళ్లవాతం, కాళ్ల పగుళ్లు కలుగును. ఈ రాహువు వలన బుద్ధి మాంధ్యము, మూర్ఖత్వము, కోర్టు వ్యవహారములలో చిక్కుట, అధికార దుర్వినియోగం. అకస్మిక మరణాలు, విషజంతువుల వలన బాధలు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ద్వారా నష్టములు, పిల్లల కిడ్నాప్ కాలుష్యాలవల్ల ప్రమాదములు వస్తాయి.
పోలీసులు కేసులలో చిక్కుకొనుట, కాంట్రాక్టు సంబంధ నష్టాలు, ఈ రాహువు కుజునితో కలిస్తే గాయాలు తగులుట, అకస్మిక ప్రమాదములు, ఈ రాహువు గురువునితో కలిస్తే సద్భావన ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తారు. ఈ రాహువు శనితోకలిస్తే తీవ్రమైన అనారోగ్యము కలుగును. రవితో కలిస్తే తండ్రితో గొడవలు సంబంధాలు దెబ్బతినుట చంద్రునితో కలిస్తే బుద్ధి మాంధ్యము, మెంటల్ ప్రవర్తన కలుగును. కేతువు వలన కలుగు వ్యాధులు అతి విచిత్రంగా ఉంటాయి. వైద్యులు కూడ సరిగా నిర్ధారణ చేయలేని గందరగోళ పరిస్థితి కలుగును.
కంటిశుక్లాలు, దీర్ఘరోగములు, కడుపునొప్పి, కడుపులో పురుగులు చేరుట అమీబియాసిస్ కలుగును. ఈగ్రహముతో శని చేరి జన్మలగ్నము నుండి అష్టమంలో ఉండి రాహువు శుక్రుల దృష్టి ఉంటే వరిబీజము, హెర్నియా, గొంతుసంబంధ వ్యాధులు ఈ గ్రహమమునకు బుధుని దృష్టి ఉంటే నరాల నొప్పులు, పక్షవాతములు కల్గును, మశూచి, మానసిక వ్యాధులు దురదలు, మెంటల్ ఎఫెక్ట్, ఉన్మాదం హిస్టీరియా రోగాలు, కురుపులు, రహస్యంగా చెడు పనులు చేయుట, మత మార్పిడీలు, అపనిందలు, అధికారులవలన అవమానములు, దైవసంబంధక్రియల్లో విఘ్నములు, అకస్మిక సంఘటనలు, అనాచారము, వ్యాపార నష్టాలు, కిరోసిన్, మంచినూనే, నువ్వులనూనెలు, పెట్రోల్, డీజిల్, అయిల్వల్ల నష్టాలు లేదా ప్రమాదములు, జంతువుల వలన నష్టాలు కలుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956
