Apple iPhone Air : మతిపొగొట్టే ఆఫర్ బ్రో.. అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ అసలు మిస్ చేయొద్దు..!
Apple iPhone Air : ఐఫోన్ కొనేవారికి కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఒక్కసారిగా ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర తగ్గింపుతో లభిస్తోంది. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఎలాగంటే..?

Apple iPhone Air : ఆపిల్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే మారడండి. మీకోసం అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం ఆపిల్ అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ మోడల్‌పై రూ. 11వేల వరకు భారీ తగ్గింపును అందిస్తోంది.

ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఐఫోన్ ఎయిర్ కూడా మార్కెట్లో రిలీజ్ అయింది. ఇందులో ఐఫోన్ ఎయిర్ రూ. 1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ కాగా, ఇప్పుడు రూ. 1,08,900 వరకు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఐఫోన్ రూ.1,12,900కు లిస్ట్ అయింది. తద్వారా రూ.7వేలు నేరుగా ధర తగ్గింపు లభిస్తుంది.

అంతేకాదు.. అదనంగా, కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.44,250 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి ధర మరింత తగ్గింపు పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ వరకు పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ ప్రోమోషన్ టెక్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఐఫోన్ A19 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్, USB-C ఛార్జింగ్ కూడా కలిగి ఉంటుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ ఎయిర్‌లో 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇంకా, ఈ ఐఫోన్ 5.6mm మందం, దాదాపు 165 గ్రాముల బరువు ఉంటుంది. ఆపిల్ అత్యంత సన్నగా తేలికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.
