Excellent Android Phones : తగ్గేదేలే.. ఆపిల్ ఐఫోన్ 17కు దీటుగా 6 అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!
Excellent Android Phones : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 17 కొనడం కన్నా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయొచ్చు.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Excellent Android Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో ఆపిల్ ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏఐ, భారీ బ్యాటరీల నుంచి డిస్‌ప్లేలు, మల్టీఫేస్ కెమెరాల వరకు అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు అందిస్తున్నాయి.

మీరు iOSకి మారకుండానే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే.. ఈ ఏడాదిలో ఐఫోన్ 17కి బదులుగా కొనుగోలు చేసే 6 అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

గూగుల్ పిక్సెల్ 10 (రూ. 68,450) : గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌తో రన్ అవుతుంది. ఏఐ ఫీచర్లతో రోజువారీ పర్ఫార్మెన్స్ బెటర్ అందిస్తుంది. 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్, 10.8MP 5x టెలిఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఐఫోన్ 17 కొనడం కన్నా ఈ ఆండ్రాయిడ్ పిక్సెల్ ఫోన్ కొనడం బెటర్ ఆప్షన్.

వివో X300 (రూ. 75,999) : వివో X300 ఫోన్ 120Hz రిఫ్రెష్ 4500-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో కాంపాక్ట్ 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. 50MP పెరిస్కోప్, అల్ట్రావైడ్ లెన్స్‌లతో సపోర్టు ఉన్న 200MP మెయిన్ కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫోటోగ్రఫీని అందిస్తుంది. డైమెన్సిటీ 9500 పవర్, 6040mAh బ్యాటరీతో ఐఫోన్ 17తో పోటీపడుతుంది.

ఐక్యూ 15 (రూ. 72,999) : ఐక్యూ 15 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో 144Hz ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, 8K వీడియోకు సపోర్టు ఇస్తుంది. అయితే, భారీ 7000mAh బ్యాటరీ లాంగ్ గేమింగ్ సెషన్‌లతో వస్తుంది. ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

వన్‌ప్లస్ 15 (రూ. 72,999) : వన్‌ప్లస్ 15లో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఫ్లూయిడ్ 165Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 పర్ఫార్మెన్స్, 16GB వరకు ర్యామ్, 7300mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP కెమెరాలతో ఐఫోన్ 17 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఒప్పో ఫైండ్ X9 (రూ. 74,999) : ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. 3600 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుంది. డైమెన్సిటీ 9500 చిప్‌తో 16GB ర్యామ్, 7025mAh బ్యాటరీని అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్-ట్యూన్ ట్రిపుల్ 50MP కెమెరాలు, అద్భుతమైన ఫొటోలతో 4K వీడియోను రికార్డు చేయొచ్చు.
