IND vs SA: మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ మనదే.. టాస్ మాత్రం ఓడిన భారత్

ఒకవేళ మ్యాచ్ ఓడితే ఈ సిరీస్‌ డ్రా అవుతుంది.

IND vs SA: మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ మనదే.. టాస్ మాత్రం ఓడిన భారత్

Pic: @BCCI

Updated On : December 19, 2025 / 6:59 PM IST

IND vs SA: గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే కప్పు మనదే. ఒకవేళ ఓడితే ఈ సిరీస్‌ డ్రా అవుతుంది.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్,తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఏడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెర్రెయిరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, లుంగి ఎన్‌గిడి, ఒట్‌నీల్ బార్ట్‌మాన్