Google Pixel 10 Pro : వారెవ్వా.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి.. డోంట్ మిస్!

Google Pixel 10 Pro : గూగుల్ పిక్సెల్ 10 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

1/5Google Pixel 10 Pro
Google Pixel 10 Pro : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? మీరు పిక్సెల్ అభిమాని అయితే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. మీ పాత ఫోన్‌ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. క్రిస్మస్ సేల్స్ కోసం చూస్తుంటే అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
2/5Google Pixel 10 Pro
గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 ప్రో ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 15,700 కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. భారత మార్కెట్లో పిక్సెల్ 10 ప్రో రూ. 1,09,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు రూ. 94,500 లోపు కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
3/5Google Pixel 10 Pro
గూగుల్ పిక్సెల్ 10 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో రూ. 1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ప్రస్తుతం రూ. 97,999కు లిస్ట్ అయింది. రూ. 12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
4/5Google Pixel 10 Pro
గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ వస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌తో అమర్చి ఉంటుంది. 16GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
5/5Google Pixel 10 Pro
ఈ హ్యాండ్‌సెట్ 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 42MP కెమెరా కలిగి ఉంది.