ఊహించని చిత్ర విచిత్రం.. మోదీ, ప్రియాంక గాంధీ నవ్వుతూ మాట్లాడుకున్నారు.. ఫొటోలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా పలు పార్టీల నేతలు ఒకే చోట కూర్చొని మాట్లాడుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్‌వాల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గ ఎంపీ సుప్రియ సూలే, సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తదితర ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఇందులో మోదీతో ప్రియాంక గాంధీ నవ్వుతూ మాట్లాడుతుండడం చూడొచ్చు. మోదీపై ప్రియాంక గాంధీ తరుచూ విమర్శలు గుప్పిస్తారన్న విషయం తెలిసిందే. (@sansad_tvX/ANI Photos)









