Indo Ukrainian couple : యుక్రెయిన్‌ అమ్మాయిని పెళ్లాడిన హైదరాబాదీ అబ్బాయి.. రిసెప్షన్ ఎక్కడంటే?

Indo-Ukrainian couple : ఒకవైపు యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు మన హైదరాబాదీ అబ్బాయి యుక్రెయిన్‌కు చెందిన అమ్మాయిని అక్కడే పెళ్లిచేసుకున్నాడు.

Indo Ukrainian couple : యుక్రెయిన్‌ అమ్మాయిని పెళ్లాడిన హైదరాబాదీ అబ్బాయి.. రిసెప్షన్ ఎక్కడంటే?

Indo Ukrainian Couple Hosts Wedding Reception In Hyderabad (1)

Indo Ukrainian couple : ఒకవైపు యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా క్షిపణులను విసురుతుంటే.. యుక్రెయిన్ డ్రోన్లతో దీటుగా ప్రతిఘటిస్తోంది. ఈ భయానక యుద్ధ పరిస్థితుల్లో మన హైదరాబాదీ అబ్బాయి.. యుక్రెయిన్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోన్నాడు. బాలీవుడ్ మూవీలోని లవ్ స్టోరీ మాదిరిగా వీరిద్దరూ వేర్వేరు దేశాలకు చెందినవారు.. రష్యా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ మోత మధ్య ప్రేమబంధాన్ని పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వారే.. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్, యుక్రెయిన్‌కు చెందిన లిబోవ్ జంట.. ఈ క్యూట్ కపుల్ యుక్రెయిన్‌లోనే పెళ్లి చేసుకుని భారతకు ప్రత్యేకమైన విమానంలో తరలిస్తున్న భారతీయులతో కలిసి స్వదేశానికి చేరుకున్నారు.

యుక్రెయిన్‌లో పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంట.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. వీరి రిసెప్షన్‌కు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులు మాట్లాడుతూ.. రష్యా యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నామని అన్నారు. మరోవైపు.. రష్యా మిలటరీపై యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలపై దాడులతో మొదలైన రష్యా దాడులు కీవ్ నగరంలోని జనావాసాలపై దాడులకు తెగబడుతోంది. రష్యా తీరుపై కన్నెర్ర చేసిన యుక్రెయిన్ సైన్యం అదే స్థాయిలో డ్రోన్లను ప్రయోగిస్తూ రష్యా బలగాన్ని దెబ్బతీస్తోంది. ఒకవైపు ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు.

Indo Ukrainian Couple Hosts Wedding Reception In Hyderabad

Indo Ukrainian Couple Hosts Wedding Reception In Hyderabad

ఇటీవలే మరో జంట.. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ పెళ్లిని యుద్ధం మొదలైన రోజునే చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ జంట. అదే రోజు పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకుంది. వాస్తవానికి మేలో ఉక్రేనియన్ రాజధాని కైవ్‌లో ప్రశాంతమైన నది పక్కన, అందమైన లైట్లతో రెస్టారెంట్ టెర్రస్‌పై ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట ముచ్చటపడింది. రష్యాలోని వాల్డై హిల్స్‌లో 21ఏళ్ల యారీనా అరివా (Yaryna Arieva) ఆమె భాగస్వామి స్వ్యటోస్లావ్ ఫర్సిన్ (Svyatoslav Fursin) వివాహం చేసుకోవాలని అనుకున్నారు. చెవుల్లో మోగుతున్న వైమానిక దాడుల సైరన్ల మధ్య ఈ జంట రింగులు మార్చుకుని ఒకటైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలుకావడంతో ఎక్కడ ఏ బాంబు పడుతుందో? ఎవరు ఎప్పుడు మరణిస్తారోనన్న భయాందోళన నెలకొంది. ఈ బాంబు దాడుల్లో మేమిద్దరం చనిపోవచ్చు.. అలా జరగడానికి ముందే పెళ్లిబంధంతో ఒక్కటి కావాలనుకున్నామని యారీనా చెప్పుకొచ్చింది.

Read Also : Russia-Ukraine Crisis : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!