Woman Marries Cat : పిల్లిని పెండ్లి చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

లండన్‌కు చెందిన దెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.

Woman Marries Cat : పిల్లిని పెండ్లి చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Woman Marry Cat

Woman Marries Cat : సాధారణంగా ప్రపంచంలో మనుషులు మనుషులనే పెళ్లి చేసుకుంటారు. అందులోనూ పురుషులు స్త్రీలు వివాహం చేసుకోసుకోవడం మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవలి కాలంలో వెరైటీగా మనుషులు.. జంతువులు, పక్షులు, చెట్లను పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు దోషాలు పోవడానికి ముందుగా చెట్లు, మేకలను పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు అతి ప్రేమ, వెరైటీ కోసం జంతువులు, పక్షులను కూడా వివాహమాడుతున్నారు.

ఇదే తరహాలో తాజాగా ఓ మహిళ.. పిల్లిని పెళ్లి చేసుకుంది. లండన్‌కు చెందిన దేబోరా హాడ్జ్‌(49) అనే మహిళ పిల్లిని పెండ్లి చేసుకున్నారు. జంతువులను పెంచుకుంటున్న వారికి ఇల్లు కిరాయికి ఇవ్వబోమని ఇంటి యజమాని షరతు పెట్టాడు. దీంతో ఆమె పెంపుడు పిల్లిని వదులుకోలేక పెళ్లి చేసుకున్నారు. అయితే, తాను ఇప్పుడు పిల్లిని పెంచుకోవడం లేదని, తన భాగస్వామి అని చెప్తున్నారు.

చెట్టుని పెళ్లి చేసుకున్న మహిళ.. ఘనంగా వెడ్డింగ్ డే సెలబ్రేషన్

లండన్‌కు చెందిన దెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లేదు. దీంతో ఆ ఇళ్లలో చేరే వాళ్లు తమ పెంపుడు జంతువులను వదిలేయాల్సివస్తోంది. లేకపోతే వాళ్లకు కిరాయి ఇళ్లు దొరకడం కష్టం. ఈ నిబంధనలు తనకు అస్సలు నచ్చలేదని దెబోరా చెప్పింది.

అంతకుముందు కూడా కొన్నిసార్లు ఇలాంటి నిబంధనల వల్ల తన పెంపుడు జంతువులను వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. తన ఇండియా (పిల్లి) విషయంలో అలా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపింది. అందుకే ఆగ్నేయ లండన్‌లోని ఒక పార్కులో తన పిల్లి పిల్లను ఈ ఇద్దరు పిల్లల తల్లి (హాడ్జ్) పెళ్లి చేసుకుంది.

Goat Marriage : జాతకంలో దోషం-మేకకు తాళి కట్టిన యువకుడు

ఇండియాను పెళ్లి చేసుకోవడం ద్వారా తాము ఇక ప్యాకేజిగా వస్తామని, తమను విడదీయడం కుదరదని చెప్పింది. తన పిల్లలు ఎంత ముఖ్యమో ఇండియా కూడా తనకు అంతే ముఖ్యమని చెప్పింది. తన పిల్లి పిల్లకు దూరం కావడం కంటే రోడ్డు మీద బతకడానికే తాను ఇష్టపడతానని దెబోరా చెబుతుతోంది. అయితే, ప్రస్తుతం దెబోరా చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.