Goat Marriage : జాతకంలో దోషం-మేకకు తాళి కట్టిన యువకుడు

జాతకంలో దోషాలు ఉన్నాయని.. రెండు సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఒక వ్యక్తి మేకకు తాళికట్టిన ఘటన సంచలనం కలిగించింది.

Goat Marriage : జాతకంలో దోషం-మేకకు తాళి కట్టిన యువకుడు

Goat Marriage At Nuziveedu

Goat Marriage : ఆధునిక కాలంలో కూడా ఇంకా ప్రజలు మూఢనమ్మకాలను ఆచరించటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. కృష్ణాజిల్లా నూజివీడులో ఒకవింత సంఘటన చోటు చేసుకుంది. జాతకంలో దోషాలు ఉన్నాయని.. రెండు సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఒక వ్యక్తి మేకకు తాళికట్టిన ఘటన సంచలనం కలిగించింది.

పట్టణంలోని అన్నవరంరోడ్డు నవగ్రహ ఆలయంలో ఉగాది పండుగ రోజు పొద్దున్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తతంగం చూసిని వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆధునికి కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమానికి యువకుడి తల్లి తండ్రులు, పుజారి మినహా మరి ఎవ్వరూ హాజరుకాలేదు.

కాగా… వివాహా దోష నివారణార్ధం గతంలో అందాలనటి ఐశ్వర్యరాయ్, ఇటీవల నయనతార కూడా చెట్టును పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. వివాహాంలో దోషాలు పోవటానికి పెళ్లికి ముందు జ్యోతిష్యులు అబ్బాయిలు, అమ్మాయిలతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటారని తెలుస్తోంది.

Also Read : Pakistan Political Crisis : నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం