Pakistan Political Crisis : నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం సమర్పించిన దాదాపు నెల

Pakistan Political Crisis : నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం

Pakistan Crisis

Pakistan Political Crisis :  పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం సమర్పించిన దాదాపు నెల రోజుల తర్వాత, కీలకమైన ఓటింగ్ ఈరోజు జరగనుంది.   పిటిఐ(పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్) సభ్యులంతా సభకు హాజరు కావాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెబ్లీలో ఇమ్రాన్ కు కావలసిన బలం 172 మంది మద్దతు. ఒకవేళ విశ్వాస పరీక్షలో ఓడిపోతే ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దిగిపోయి రాజీనామా చేయాలని కోరింది.

ఇమ్రాన్‌ఖాన్ సార‌ధ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి రెండు పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి.  బెలూచిస్తాన్ అవామీ పార్టీ, ముత్తాహిద ఖ్వామి మూవ్‌ మెంట్ (పాకిస్తాన్‌) పార్టీలు విపక్షాలకు మద్దతు తెలిపాయి.
Also Read : Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

విపక్ష కూటమి తమకు 175 మంది మద్దతు ఉందని ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ బల నిరూపణలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓడిపోయి పదవి నుంచి… దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది.