Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్​లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది.

Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

Omicron

Omicron new variant ‘XE’ : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్​ఈ’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. యూకేలో మొదటగా ఒమిక్రాన్ ఎక్స్​ఈ వేరియంట్ గుర్తించారు. అత్యంత వేగంగా ఎక్స్​ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్​ నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందన్నారు.

వైరస్ కట్టడి చర్యలను తగ్గించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. బీఏ1, బీఏ2 రకాల కలయికతో ఉన్న వైరస్​ ‘ఎక్స్​ఈ’ను జనవరి 19న గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దాదాపు 600 రకాలను పరిశీలించినట్లు నివేదికలో వెల్లడించారు.

Covid Vaccine Efficacy : ఒమిక్రాన్‌పై కరోనా వ్యాక్సిన్ యాంటీబాడీల రక్షణ తక్కువే.. అధ్యయనంలో వెల్లడి!

బీఏ 2 రకం కంటే పది రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్స్​ఈ వేరియంట్​కు ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. దీనిపై ఇంకా పరిశోధనలు అవసరమని అభిప్రాయపడింది. వైరస్ లక్షణాలు, తీవ్రతలోనూ తెడాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నారు.

ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్​లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది. టెస్టులు తగ్గడం వల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు పెరుగుతాయని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది.