Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు
ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్‌లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది.
- bheemraj
- Published On : April 3, 2022 / 10:02 AM IST
Omicron
Omicron new variant ‘XE’ : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. యూకేలో మొదటగా ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ గుర్తించారు. అత్యంత వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందన్నారు.
వైరస్ కట్టడి చర్యలను తగ్గించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. బీఏ1, బీఏ2 రకాల కలయికతో ఉన్న వైరస్ ‘ఎక్స్ఈ’ను జనవరి 19న గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దాదాపు 600 రకాలను పరిశీలించినట్లు నివేదికలో వెల్లడించారు.
Covid Vaccine Efficacy : ఒమిక్రాన్‌పై కరోనా వ్యాక్సిన్ యాంటీబాడీల రక్షణ తక్కువే.. అధ్యయనంలో వెల్లడి!
బీఏ 2 రకం కంటే పది రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్స్ఈ వేరియంట్‌కు ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీనిపై ఇంకా పరిశోధనలు అవసరమని అభిప్రాయపడింది. వైరస్ లక్షణాలు, తీవ్రతలోనూ తెడాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్‌లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది. టెస్టులు తగ్గడం వల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
