చెట్టుని పెళ్లి చేసుకున్న మహిళ.. ఘనంగా వెడ్డింగ్ డే సెలబ్రేషన్

  • Published By: nagamani ,Published On : September 15, 2020 / 05:19 PM IST
చెట్టుని పెళ్లి చేసుకున్న మహిళ.. ఘనంగా వెడ్డింగ్ డే సెలబ్రేషన్

38 ఏళ్ల మహిళ ఓ చెట్టును పెళ్లి చేసుకుంది. ఇది పెద్ద వింతగా మారింది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో దోషం ఉన్న మహిళలకు చెట్టుతో పెళ్లిచేస్తారు. కానీ ఈమె మాత్రం అలాకాదు. ఓ మంచి ఉద్ధేశ్యంతో ఆమె ఓ చెట్టుని పెళ్లి చేసుకుంది. అదేంటీ అని ఎవరైనా ఆమెను అడిగితే…చెట్టుని పెళ్లి చేసుకుంటే విడాకులు గోల ఉండదుగా అంటూ గలగలా నవ్వేస్తుంది. విడాకుల గోల ఉండదు..అభిప్రాయబేధాలు ఉండవు..పైగా నా భర్త నీడన కూర్చుంటే హాయిగా ఉంటుంది అది అందరికీ సాధ్యం అవుతుందా? అంటూ నవ్వేస్తుంది. ‘‘అదేంటీ మమ్మీ నువ్వు చెట్టుకుని పెళ్లి చేసుకోవటమేంటి? అని ఆమె 15ఏళ్ల కొడుకు అడిగితే..ఆ..అవును ఇకనుంచి ఆ చెట్టే నీకు డాడీ అని చెప్పింది.దీంతో ఆ పిల్లాడు బిక్కమొహం వేశాడు.

అసలు విషయంలోకి వెళితే..ఇంగ్లండ్ లోని మెర్సీసైడ్‌లోని సెఫ్టోన్‌లో గల రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ సమీపంలో ఉన్న కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. 2019లో కేట్ ‘ఎల్డర్’ అనే పేరు ఉన్న ఓ పెద్ద చెట్టును పెళ్లి చేసుకుంది. ఇది తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇదేంటీ చెట్టుని పెళ్లి చేసుకోవటమేంటి…చిత్రంగా అనుకుని తెగ ఆశ్చర్యపోయారు. కానీ ఆమె చేసిన ఈ పని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. కేట్‌కు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో సహజీవనం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు.


కేట్ బాయ్‌ఫ్రెండ్ ఇప్పటికీ ఆమెను పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె చెట్టును పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చెట్టును పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో విడాకులు తీసుకునే బాధే ఉండదు. ఇది వినేవారికి కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ..ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే.. ఈ నిర్ణయం నాకు చాలాబాగా నచ్చింది. అంతేకాదు..నేను చెట్టుని పెళ్లి చేసుకోవటానికి మరో కారణం కూడా ఉందని తెలిపింది.


రిమ్‌రోజ్ వ్యాలీ కౌంటీ పార్క్ ప్రాంతం అంతా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. దీంతో అధికారులు ఈ పార్క్ మీదుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణానికి పార్క్‌లో ఉన్న చెట్లను నరికి వేయాల్సి వచ్చింది. దీన్ని స్థానికులు వ్యతిరేకించారు. పచ్చని చెట్లు కొట్టేయటమేంటి దానికి మేం ఒప్పుకోం అంటూ వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు. ఉద్యమిస్తున్నారు.



https://10tv.in/man-attempts-murder-on-his-ex-wifes-husband-warangal-district/
ఈ క్రమంలో కేట్ ఆ పార్క్‌లోని చెట్టునే పెళ్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రకృతి ప్రేమికులు సైతం ఆమె నిర్ణయానికి ఫిదా అయ్యారు. ఆమె స్ఫూర్తితో ఇకపై ఏటా ‘మ్యారీ ఏ ట్రీ డే’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా ప్రతీ సంవత్సరం వారి పెళ్లి రోజు చేయాలని నిర్ణయించుకున్నారు.


దీనిపై కేట్ మాట్లాడుతూ..తాను ఎంతో ఆలోచించి ‘ఎల్డర్’ అనే చెట్టుని పెళ్లి చేసుకున్నాననీ..దానికి మెక్సికోలోని మహిళా కార్యకర్తలు ఇచ్చి స్ఫూర్తేనని తెలిపింది. అభివృద్ది పేరుతో మెక్సికోలో అధికారులు చెట్లను నరికి వేస్తుంటే దాన్ని అడ్డుకుని కొంతమంది మహిళలు ఆయా ప్రాంతాల్లో ఉండే చెట్లను నరికివేయటాన్ని అడ్డుకుని ఆ చెట్లను వారు పెళ్లి చేసుకున్నారు. దీంతో అధికారులు చెట్లను కొట్టివేయటం ఆపివేయాల్సి వచ్చింది. అదే స్ఫూర్తితోనే నేను చెట్టుని పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా అభివృద్ది పేరుతో చెట్లను భారీ సంఖ్యలో నరికివేస్తున్నారనీ..ఇది సరైందికాదని చెట్లను నరికివేస్తే పర్యవారణానికి తీవ్ర హాని జరుగుతుందని చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని కేట్ తెలిపింది.