PUBG Game: పబ్జీ గే‌మ్‌లో గొడవ.. శవమై తేలిన 13 ఏళ్ల బాలుడు!

పబ్జీ గేమ్.. ఆ గేమ్ ను పోలి పుట్టుకొచ్చిన మరికొన్ని గేమ్స్ జీవితాలకు జీవితాలనే బలి తీసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్స్ లో ఇప్పుడు ఈ గేమ్స్ బాగానే ఆడుతున్నారు. అయితే.. ఈ ఆటకు బానిసైతే ఎంత ప్రమాదమో కర్ణాటకలో జరిగిన ఈ ఘోర ఘటన మరోసారి నిరూపిస్తుంది.

PUBG Game: పబ్జీ గే‌మ్‌లో గొడవ.. శవమై తేలిన 13 ఏళ్ల బాలుడు!

Pubg Game

PUBG Game: పబ్జీ గేమ్.. ఆ గేమ్ ను పోలి పుట్టుకొచ్చిన మరికొన్ని గేమ్స్ జీవితాలకు జీవితాలనే బలి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మనదేశంలో పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్స్ ను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అదే ఆ గేమ్ ఉన్న సమయంలో గేమ్ మోజులో పడి పోయిన ప్రాణాలకు లెక్కేలేదు. గేమ్ ఆడుతూ నరాలు బిగుసుకుపోయిన వాళ్ళు.. మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు.. గుండెపోట్లు ఇలా ఎన్నోరకాలుగా ఈ గేమ్ బలి తీసుకుంది. అయితే.. ఇప్పుడు ఒరిజినల్ పబ్జీ లేదు కానీ దానిని పోలిన గేమ్స్ బోలెడు వచ్చేశాయి. మొబైల్ ఫోన్స్ లో ఇప్పుడు ఈ గేమ్స్ బాగానే ఆడుతున్నారు.

అయితే.. ఈ ఆటకు బానిసైతే ఎంత ప్రమాదమో కర్ణాటకలో జరిగిన ఈ ఘోర ఘటన మరోసారి నిరూపిస్తుంది. దక్షిణ కన్నడ జిల్లా కేసీ రోడ్లోని హకీఫ్(13) తరచూ పబ్జీ గేమ్ ఆడుతుండేవాడట. ఇంట్లో తల్లిదండ్రులు వారించినా వినకుండా ఆ గేమ్ కు బానిసయ్యాడు. కాగా.. అతడు ఇటీవల ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హత్యకు గురై.. వాళ్ల ఇంటికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో శవమై కనిపించాడు. హకీఫ్ తప్పిపోయాడని అతడి తల్లిదండ్రులు ఉల్లాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెతికి ఆ బాలుడి శవాన్ని గుర్తించారు.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పబ్జీ కోసం బాలుడి స్నేహితుల మధ్య తలెత్తిన గొడవే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తూ కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాలుడు హకీఫ్ ఒంటిపై గాయాలతో పడి ఉండడంతో ఇది ఘర్షణల వలన జరిగిన హత్య కోణంలోనే విచారణ కొనసాగుతుంది. పబ్జీ గేమ్ మీద పిచ్చితోనే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోగా తల్లిదండ్రులు వెతికినా దొరకలేదు. కానీ చివరికి ఆ గేమ్ పిచ్చితోనే శవమై తేలడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.