SSLC Results 2024 : కర్ణాటక ఎస్ఎస్ఎల్‌సీ 2024 ఫలితాలు విడుదల.. దాదాపు 73శాతం ఉత్తీర్ణత, టాపర్ ఎవరంటే?

SSLC Results 2024 : 2024లో 6,31,204 మంది విద్యార్థులు 73.40శాతం ఉత్తీర్ణతతో ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల్లో అర్హత సాధించారు.

SSLC Results 2024 : కర్ణాటక ఎస్ఎస్ఎల్‌సీ 2024 ఫలితాలు విడుదల.. దాదాపు 73శాతం ఉత్తీర్ణత, టాపర్ ఎవరంటే?

SSLC Results 2024 ( Image Credit : Google )

SSLC Results 2024 : కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (KSEAB) కర్ణాటక SSLC 2024 ఫలితాలను మే 9న ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కేఎస్ఈఏబీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు. పరీక్షా ఫలితాలను (karresults.nic.in) లేదా (kseab.karnataka.gov.in) వెబ్‌సైట్‌లలో చూడవచ్చు. కేఎస్ఈఏబీ డేటా ప్రకారం.. దాదాపు 6,31,204 మంది విద్యార్థులు 2024లో ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షలకు 73.40శాతం ఉత్తీర్ణతతో విజయవంతంగా అర్హత సాధించారు.

2023లో ఉత్తీర్ణత శాతం 83.89శాతంగా నమోదైంది. 10వ తరగతిలో 625కి 625 స్కోర్‌తో ఎస్ఎస్ఎల్‌సీ బోర్డు పరీక్షలో అంకితా బసప్ప అనే విద్యార్థిని టాపర్‌గా నిలిచారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు బోర్డు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 4.5 లక్షల మంది పురుషులు, 4.3 లక్షల మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉత్తీర్ణత శాతం 72.83శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 74.14శాతంగా నమోదైంది.

ఈ ఏడాది ఫలితాల్లో బాలుర కన్నా బాలికలే మెరుగ్గా రాణించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 81.11శాతం ఉండగా, బాలురు 65.90శాతంగా ఉన్నారు. దాదాపు 2,87,416 మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, 3,43,788 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎస్ఎస్ఎల్‌సీ పరీక్ష మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య జరిగింది. జేటీఎస్ విద్యార్థులకు ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు ఏప్రిల్ 8, 2024న నిర్వహించారు.

SSLC రిజల్ట్స్ చెక్ చేయాలంటే? :

  • అధికారిక వెబ్‌సైట్ (karresults.nic.in)ని విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో కర్ణాటక SSLC రిజల్ట్స్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో సహా మీ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత Submit చేయండి.
  • మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు.

Read Also : Karnataka SSLC Results : ఈ నెల 9నే కర్ణాటక SSLC రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోవచ్చు!