JEE Admit Cards : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?

JEE Advanced 2024 Admit Cards : మే 26న మధ్యాహ్నం 2:30 గంటల వరకు అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే 26, 2024న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.

JEE Admit Cards : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?

JEE Advanced 2024 Admit Cards Out ( Image Credit : Google )

JEE Advanced 2024 Admit Cards : ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024కు సంబంధించి అడ్మిట్ విడుదల చేసింది. పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయడానికి తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మే 26న మధ్యాహ్నం 2:30 గంటల వరకు అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే 26, 2024న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌లలో అభ్యర్థి పేరు, జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2024 రోల్ నంబర్, ఫోటోగ్రాఫ్, సంతకం, పుట్టిన తేదీ, కరస్పాండెన్స్, కేటగిరీ అడ్రస్ గురించి వివరాలు ఉంటాయి.

అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ కాపీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 వెబ్‌సైట్‌లో మే 31, 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. తాత్కాలిక ఆన్సర్ కీ కూడా జూన్ 2, 2024న విడుదల కానుంది. జేఈఈ అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించడానికి జూన్ 2 నుంచి జూన్ 3, 2024 వరకు సమయం ఉంటుంది. తాత్కాలిక సమాధాన కీలపై తుది ఫలితాలు జూన్ 9, 2024న ప్రకటించనుంది.

జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో మాత్రమే నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రం రెండు పేపర్లలో పేపర్ 1, పేపర్ 2 ఒక్కొక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. రెండు పేపర్లకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రతి ప్రశ్నాపత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనే 3 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ అనేది బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, ఇంజనీరింగ్, సైన్సెస్ లేదా ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఐఐటీలో అడ్మిషన్‌ను పొందవచ్చు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?