Cm Revanth Reddy : బీజేపీ మళ్లీ గెలిస్తే జరిగేది ఇదే, 400 సీట్లు అడుగుతున్నది అందుకే..- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే.

Cm Revanth Reddy : బీజేపీ మళ్లీ గెలిస్తే జరిగేది ఇదే, 400 సీట్లు అడుగుతున్నది అందుకే..- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? బీజేపీ 400 సీట్లు అడుగుతున్నది ఎందుకు? ఇంతకీ ఆర్ఎస్ఎస్ అజెండా ఏంటి? అన్న ప్రశ్నలకు 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

”రాజ్యాంగం మార్చాలన్నది, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ విధానం. త్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్.. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉన్నవే. ఇప్పటివరకు వీటన్నింటిని బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈసారి 400 సీట్లు అడుగుతున్నది అందుకే.

కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇలా చేయాలంటే సభలో మెజార్టీ ఉండాలి, 50శాతానికి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టి, 400 సీట్లు సాధించి రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యాన్ని నేను వివరించుకుంటూ వచ్చా. దానికి బీజేపీ వాళ్లు సమాధానం చెప్పడం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

పూర్తి వివరాలు..