Updated On - 4:57 pm, Thu, 8 April 21
corona cases increase in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 2వేల 558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 6 మంది మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. 31, 268 శాంపిల్స్ ను పరీక్షించారు.
24 గంటల్లో 915 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు ఏపీలో 1,53,33,851 శాంపిల్స్ ను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 915832.
ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,913. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 893651. మొత్తం మరణాల సంఖ్య 7268.