Senior Heroins: ఏజ్ నాట్ ఇంపార్టెంట్.. కుర్రహీరోలతో సీనియర్ భామల రొమాన్స్!

సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో.. ఈ కాంబినేషన్స్ ఈమధ్య చాలానే సెట్స్ పైకెళ్లాయి. స్ట్రిప్ట్ నచ్చితే స్టార్ డం అయినా, వయసైనా, ఏం తక్కువైనా పర్వాలేదనేస్తున్నారు అందాల భామలు.

Senior Heroins: ఏజ్ నాట్ ఇంపార్టెంట్.. కుర్రహీరోలతో సీనియర్ భామల రొమాన్స్!

Senior Heroins

Senior Heroins: సీనియర్ హీరోయిన్ – యంగ్ హీరో.. ఈ కాంబినేషన్స్ ఈమధ్య చాలానే సెట్స్ పైకెళ్లాయి. స్ట్రిప్ట్ నచ్చితే స్టార్ డం అయినా, వయసైనా, ఏం తక్కువైనా పర్వాలేదనేస్తున్నారు అందాల భామలు. సౌత్ టు నార్త్ ఇప్పుడిదే కాంబో ట్రెండ్ అవుతోంది. క్రేజీ క్రేజీ స్టోరీలతో ఈ డిఫరెంట్ జంటలొచ్చేస్తున్నాయి. 2021లో ఒక్క సినిమా కూడా చూపెట్టని సీనియర్ స్టార్ అనుష్కా శెట్టి. అయితే 2022లో మాత్రం యంగ్ హీరో జోడీగా రాబోతుంది. స్వీటీ స్టార్ డం ముందు, సీనియారిటీ ముందు నవీన్ ఇంకా చిన్నపిల్లాడే. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారంటూ టాలీవుడ్‌లో కొన్నాళ్ల నుంచి స్టోరీస్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈమధ్యే యువీ క్రియేషన్స్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఇద్దరితో ఓ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించేసింది. అందాల స్వీటీతో జాతిరత్నం కలిస్తే రచ్చ మామూలుగా ఉండదన్న డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ‘రారా కృష్ణయ్య’ఫేం మహేశ్‌బాబు.పి. డైరెక్షన్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ పైకెళ్లబోతుంది. మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి అనే టైటిల్ సెట్ చేసే ఛాన్స్ ఉంది ఈ ప్రాజెక్ట్ కి.

OTT Release: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!

2022లో హవా చూపించబోతుంది సమంతా. సింగిల్ గా పాన్ ఇండియా సినిమాలను చూపించబోతుంది. అయితే వాటిలోనూ సామ్ కు హీరోలు కావాలి కాబట్టి వాళ్లనీ సెట్ చేసుకుంటుంది. కాకపోతే తనకన్నా స్టార్ డం తక్కువున్న మలయాళీ హీరోలు ఈ స్టార్ హీరోయిన్ పక్కన కనిపించబోతున్నారు. శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్ నటించగా.. సైన్స్ థ్రిల్లర్ యశోదలో ఉన్ని ముకుందన్ ను ఫిక్స్ చేశారు. ఆల్రెడీ భాగమతి సినిమాలో అనుష్కకు జంటగా కనిపించిన ఉన్ని ముకుందన్.. ఇప్పుడు సామ్ సరసన చేస్తున్నాడు. గతంలో ఓ బేబిలో కూడా నాగశౌర్యతో ఇలాగే ఆడిపాడింది సమంతా.

RGV-Nagababu: ఆర్జీవీ నోట నాగబాబు మాట..!

సామ్, డైరెక్టర్ నందినిరెడ్డి కోసం ఓ బేబి చేసిన నాగశౌర్య.. ఇప్పుడు చిరూ కోసం అదే పని చేయబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి భోళాశంకర్ సినిమాకు శౌర్య కమిట్ మెంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో చిరూ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ కు జోడీగా నాగశౌర్యను డైరెక్టర్ మెహర్ రమేశ్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే కీర్తి సురేశ్ జోడీగా.. అదీ మెగాస్టార్ సినిమాలో మెరుస్తాడు నాగశౌర్య. బట్ క్యారెక్టర్ డమ్మీ అయితే చిరూ మూవీ అయినా నాగశౌర్యకు కలిసొచ్చేది ఏమీ ఉండదు.

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

ఒక్క టాలీవుడ్ లోనే బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. డైరెక్టర్స్ చెప్పిన కథ నచ్చితే యంగ్ హీరోలకు ఓటేస్తున్నారు సీనియర్ అందగత్తెలు. దీపికా, కత్రినా, విద్యాబాలన్ లాంటి వాళ్లు వెంటనే సైన్ చేసేస్తున్నారు. అయినా యంగ్ హీరోల సరసన మెరిస్తే.. వీళ్లు ఇంకొన్నాళ్లు యంగ్ భామల్లాగే ట్రెండ్ చూపించొచ్చు కదా.. ఇదే అక్కడ మెయిన్ పాయింట్.. టర్నింగ్ పాయింట్.

Dhruv-Banita : ప్రేమలో మునిగితేలుతున్న ‘అర్జున్‌రెడ్డి’ హీరో హీరోయిన్??

ఈమధ్య బీచ్ దగ్గర కూర్చున్న దీపికా ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. వాటిలో యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో హాట్ గా కనిపించింది దీపికా. ఈ పిక్స్.. బాలీవుడ్ న్యూ మూవీ గెహ్రయ్యాన్ సినిమాలోవి. ఇందులో దీపికా తనకంటే చిన్నవాడైన సిద్ధాంత్ తో కాంప్లికేషన్ రొమాన్స్ చేయబోతుంది. ఈ మూవీలో అనన్య పాండే, ధైర్య కార్వ వంటి వారు కూడా నటిస్తున్నారు. శకున్ బత్రా డైరెక్ట్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ ని. అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 25న దీపికా, సిద్ధాంత్ మూవీ రిలీజ్ కాబోతుంది.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

కత్రినా కైఫ్, విజయ్ సేతుపతితో నటిస్తోంది. మెర్రీ క్రిస్ మస్ పేరుతో రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్లింది. విజయ్ సేతుపతికి స్టార్ డం లేదని కాదు కానీ ఇది బాలీవుడ్ మూవీ.. అక్కడ సేతుపతి కంటే కత్రినానే ఫేమస్. బట్ వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తున్న విజయ్ కి అక్కడా పేరు రావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అంధాధూన్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ వీళ్లిద్దరిని కలిపాడు. త్వరలోనే విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నారు.

Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామ్ముర్తిలతో న్యూ ఏజ్ సినిమా చేయబోతుంది విద్యాబాలన్. ప్రతీక్ గాంధీ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో పేరుతెచ్చుకుంటున్నాడు. సో విద్యా అతనితో కలిసి ఈ ప్రాజెక్ట్ లో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో ఇలియానా డిక్రూజ్ కూడా కనిపించబోతుంది. విద్యానే కాదు తనకంటే వయసులో చిన్నవాడైనా గట్టివాడు నిక్ జోనస్ ను పెళ్లాడినా ప్రియాంక అయినా, కరినా కపూర్ అయినా స్టోరీ నచ్చితే యంగ్ హీరలతో ఒకే అనేస్తున్నారు.