Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

రెండేళ్ల నుంచి సరిగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో పెద్ద సినిమాలన్నీ వరసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఒకపక్క సినిమాలు మొత్తానికి రిలీజ్ అవుతున్నాయన్న ఆనందం ఎంతుందో..

Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

Star Heroes Movies

Star Heroes Movies: రెండేళ్ల నుంచి సరిగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో పెద్ద సినిమాలన్నీ వరసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఒకపక్క సినిమాలు మొత్తానికి రిలీజ్ అవుతున్నాయన్న ఆనందం ఎంతుందో.. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ కూడా అదే రేంజ్ లో ఉంది హీరోలకి. అందుకే అంతకముందు సినిమాల రియాక్షన్ చూసి తమ సినిమాల్లో కరెక్షన్లు కూడా స్టార్ట్ చేస్తున్నరు కొంతమంది. ట్రిపుల్ఆర్ హడావిడి అయిపోయింది. ఇక మరో రెండు వారాల్లో రిలీజ్ అవ్వబోతోంది బీస్ట్ మూవీ. ఈ సినిమా టైటిల్ తోనే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి క్లియర్ గా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైమ్.. రిలీజ్ చేసిన పాటలతో రొమాన్స్ కూడా ఉందని హింట్ ఇచ్చింది. మరి ఈరెండిటినీ మిక్స్ చేసి ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేస్తారో.. ఏప్రిల్ 13 వరకూ వెయిట్ చేసి చూడాల్సిందే.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

పాన్ ఇండియా లెవల్లో అసలు సిసలు యాక్షన్ ని చూపించబోతోంది కెజిఎఫ్ 2. కన్నడలో రిలీజ్ అయి ఇండియా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ అయిన కెజిఎఫ్ కి కంటిన్యూషన్ గా వస్తోన్న కెజిఎఫ్ 2 మీద విపరీతంగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకముందే ఎన్నో యాక్షన్ మూవీస్ వచ్చినా, ఎన్నో రివేంజ్ స్టోరీస్ వచ్చినా.. ఆడియన్స్ కి సమ్ థింగ్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది కెజిఎఫ్. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్అ వుతున్న ఈసినిమాలో భారీ స్టార్ కాస్ట్ తో పాటు ఎలివేషన్ ని ఇంకాస్త పెంచడానికి నెక్ట్స్ లెవల్ సీన్లు యాడ్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే తన ఎక్సెప్షనల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని కట్టిపడేసిన యష్.. మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడానికి వస్తున్నారు.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక రిలీజ్ అయిన సినిమాలతో మిక్స్ డ్ రిజల్ట్ అందుకున్న మెగాస్టార్.. ఆచార్యగా నెక్ట్స్ మన్త్ ఎండ్ కి ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. సైరా నర్సింహారెడ్డి ఇచ్చిన షాక్ కి రొటీన్ కమర్షియల్ సినిమాగా కాకుండా సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండే కాన్సెక్ట్ ఎంచుకుని చరణ్ ని కూడా ఈ సినిమాలో యాడెడ్ ఎట్రాక్షన్ గా పెట్టుకున్నారు మెగాస్టార్. దాంతో పాటు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లో ఉన్న కొరటాల శివ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్సుంది కాబట్టి.. ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

సమ్మర్ లో హీట్ ని ఇంకాస్త పెంచడానికి మే 12న ధియేటర్లోకి వస్తున్నారు మహేష్ బాబు. అసలే నాన్ స్టాప్ సక్సెస్ మీదున్న సూపర్ స్టార్ సర్కారు వారి పాటతో ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ అయినా మహేష్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కి తోడు పరశురామ్ మేకింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్సుంది. అంతేకాదు.. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన టీజర్స్ తో మహేష్ బాబు యాక్షన్ పవర్ చూపించిన టీమ్.. సినిమాలో ఇంతకుమించి ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు.

Kollywood Star Heroes : స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్..

వరసగా ఫ్లాపుల్లోఉన్నా.. క్రేజ్ ఏమాత్రం తగ్గని హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ సారి రూట్ మార్చి యాక్షన్ లోకి దిగాడు. పాన్ ఇండియా హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పూరీ జగన్ డైరెక్షన్లో బాక్సింగ్ డ్రాప్ లో మైక్ టైసన్ లాంటి టాప్ బాక్సర్ తో ఆగస్ట్ 25న రిలీజ్ అవుతున్న సినిమా ఇప్పటికే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పటికే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు, అదే ఎమోషన్ తో అంతగా రిజల్ట్ రాని సినిమాల్నిచూసి కాస్త టెన్షన్ పడుతూ.. సినిమాలో ఇంకేం ఎలిమెంట్స్ యాడ్ చెయ్యలా అన్న ఆలోనలో పడ్డారు టీమ్.