Kollywood Star Heroes : స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్..

లీవుడ్‌లో స్టార్ వార్ జరగబోతోంది.. అది కూడా పెద్ద హీరోల మధ్య.. బడాస్టార్స్ అంతా ఒకే సారి యుద్థానికి సిద్ధం అవుతున్నారు..

Kollywood Star Heroes : స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్..

Kollywood Star Heroes

Kollywood Star Heroes: కోలీవుడ్‌లో స్టార్ వార్ జరగబోతోంది. అది కూడా పెద్ద హీరోల మధ్య.. బడాస్టార్స్ అంతా ఒకే సారి యుద్థానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తమ సినిమాలు షూటింగ్స్‌ను చాలా వరకూ కంప్లీట్ చేసుకున్న వారు.. దివాళిని టార్గెట్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు.

తమిళంలో ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు. తమిళ తలైవా రజనీకాంత్, తలా అజిత్‌తో పాటు దళపతి విజయ్ ఒకే సారి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అది కూడాదివాళిని టార్గెట్‌గా మూవీస్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు దివాళి సెంటిమెంట్ ఉంది. ఆ టైమ్‌లో సినినిమాలు కలిసి వస్తాయి అని ఆయన నమ్మకం. అందుకే ‘అన్నాత్తే’ షూటింగ్ కోవిడ్ పాండమిక్ టైమ్‌లో కూడా హైదరాబాద్ వచ్చి.. ఇక్కడే సాధ్యమైనంత వరకూ కంప్లీట్ చేశారు.. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం ఎప్పటి వరకూ ఉంటుందో తెలియదు. కానీ దసరా, దివాళి టైమ్ సద్దుమణుగుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ‘అన్నాత్తే’ను దివాళికి ముస్తాబు చేస్తున్నాడు డైరెక్టర్ శివ.

కోలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్‌కు విజయ్ ఫ్యాన్స్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అటువంటిది.. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇంకేమన్నా ఉందా. ఈ ఏడాది దివాళికి అదే జరగబోతోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు చెరో సినిమాతో దీపావళి టార్గెట్‌గా నడుస్తున్నారు. స్టార్ హీరో అజిత్, వినోద్ డైరెక్షన్‌లో ‘వాలిమై’ చేస్తున్నారు. ఈ మూవీ చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుని కరోనా వల్ల పెండింగ్ పడిపోయింది. ‘వాలిమై’ ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఇక పెండింగ్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుని దివాళికి రావాలని ప్లాన్.

అటు విజయ్ కూడా నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే స్టార్ట్ అవ్వడం వల్ల పెండింగ్ షూటింగ్ చాలా ఉంది. దాంతో కరోనా లాక్‌డౌన్ నుంచి రిలీఫ్ వస్తే.. నాన్ స్టాప్‌గా షూటింగ్ పెట్టుకుని.. ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని టీమ్ ప్లాన్. వీరు కూడా దివాళి సెంటిమెంట్‌తోనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అటు ‘అన్నాత్తే’, ఇటు ‘వాలిమై’ చాలా వరకూ వర్క్ జరిగిపోయింది. విజయ్ సినిమాకు టైమ్ దొరుకుతుందా లేదా.. అసలు ఈ ముగ్గురు పోటీకి కరోనా సెకండ్ వేవ్ అడ్డుగా మారుతుందా అనేది చూడాలి.