Don 3: రణవీర్ సింగ్ పై బ్యాన్.. ‘డాన్ 3’లోకి ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్
డాన్ 3(Don 3) కోసం కొత్త కండీషన్స్ పెట్టిన షారుఖ్ ఖాన్.
After ranveer singh ban, shah rukh khan doing don 3
- షారుఖ్ క్రేజీ కండిషన్‌తో ఎంట్రీ
- దర్శకుడిగా అట్లీ వచ్చే అవకాశం
- విలన్‌గా విజయ్ దేవరకొండ టాక్
Don 3: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ చిత్రం చుట్టూ గత కొన్ని రోజులుగా తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సినిమా నుండి హీరో రణవీర్ సింగ్ తప్పుకోవడం, దీనివల్ల తమకు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రణవీర్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్’ నిషేధం కూడా విధించింది. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కథ సరికొత్త మలుపు తిరిగింది.
Meenakshi chaudhary: కిల్లింగ్ స్మైల్‌తో మీనాక్షి చౌదరి మాయాజాలం.. నెట్టింట అందాల రచ్చ
తాజా సమాచారం ప్రకారం, ఫర్హాన్ అక్తర్ మళ్లీ ఈ ప్రాజెక్ట్ కోసం కింగ్ ఖాన్ షారుఖ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో కథ నచ్చక ‘డాన్ 3’ని తిరస్కరించిన షారుఖ్, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కండిషన్‌తో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తనకు ‘జవాన్’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ అట్లీకి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తేనే తాను ‘డాన్ 3(Don 3)’ చేస్తానని షారుఖ్ కండిషన్ పెట్టినట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండబోతోంది. నెగెటివ్ రోల్ కోసం ఇప్పటికే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అలాగే విలక్షణ నటుడు విక్రాంత్ మాస్సేలను ఫర్హాన్ అక్తర్ సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడిగా అట్లీని తీసుకోవాలన్న షారుఖ్ షరతుపై మరియు విలన్ ఎంపికపై ఫర్హాన్ అక్తర్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
