HBD NBK: బాలయ్య బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ!

నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు నేడు(జూన్ 10). తమ అభిమాన హీరో పుట్టినరోజంటే అభిమానులకు పండగే కదా మరి. అందుకే బాలయ్యకి శుభాకాంక్షలు చెబుతూ ఓ పక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్న అభిమానులు బయట కూడా కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

HBD NBK: బాలయ్య బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ!

Hbd Nbk

HBD NBK: నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు నేడు(జూన్ 10). తమ అభిమాన హీరో పుట్టినరోజంటే అభిమానులకు పండగే కదా మరి. అందుకే బాలయ్యకి శుభాకాంక్షలు చెబుతూ ఓ పక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్న అభిమానులు బయట కూడా కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెష్ తెలియజేస్తుండడంతో బాలయ్య పేరు ఇపుడు సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది.

ఇక బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చూస్తే.. ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాప్ హీరో. అలాగే తెలుగులో నటవారసుల్లో కూడా టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు బాలయ్యే. ఎంతటి, ఎలాంటి డైలాగ్ అయినా అత్యద్భుతంగా పలికించగల పదజాల ప్రావీణ్యుడే కాకుండా అంతకుమించిన విలక్షణ నటుడు. బాలనటుడిగా 1974లో వెండితెర మీద వెలిగిన నటసింహం ఇప్పటి వరకు అవిశ్రాంతంగా 47 ఏళ్ళుగా నటిస్తూనే ఉన్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా భారీ అభిమానులను సంపాదించుకున్న బాలయ్య కెమెరా ముందుకెళ్తే పూనకాలేనని చెప్తారు.

టాలీవుడ్లో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించగల ఏకైక నటుడు కూడా బాలయ్యే. మాస్ మేనరిజంతో ప్రేక్షకులను కట్టిపడేసే బాలయ్య డైలాగ్ చెప్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. కంటిచూపుతో కలెక్షన్లు కొల్లగొట్టిన చరిత్ర కూడా ఈ నందమూరి హీరోకే సాధ్యమైంది. ఇప్పటివరకు 105 సినిమాలలో నటించిన బాలయ్య త్వరలో 106 సినిమా ‘అఖండ’తో పలకరించనున్నారు. ఇదే పుట్టినరోజున గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి గోపీచంద్ బాలయ్యని ఇక ఆ రేంజ్ లో చూపిస్తాడో చూడాల్సి ఉంది.