Sharat Saxena : ఏడు పదుల వయసు.. హీరోలకు దీటుగా ఫిజిక్..

‘ఒక ప్రాణం తీసా.. ఒక ప్రాణం పోశా.. లెవలై పోయింది’.. ఈ డైలాగ్ వినగానే మెగాస్టార్ ‘ముఠామేస్త్రి’ లో ‘ఆత్మ’ పాత్రలో హుందాగా విలనిజాన్ని పండించిన నటుడు శరత్ సక్సేనా గుర్తొస్తారు..

Sharat Saxena : ఏడు పదుల వయసు.. హీరోలకు దీటుగా ఫిజిక్..

Sharat Saxena

Sharat Saxena: ‘‘ఒక ప్రాణం తీసా.. ఒక ప్రాణం పోసా.. లెవలైపోయింది’’.. ఈ డైలాగ్ వినగానే తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ కెరీర్‌లో మెమరబుల్ మూవీ ‘ముఠామేస్త్రి’ లో ‘ఆత్మ’ క్యారెక్టర్.. ఆ పాత్రలో హుందాగా విలనిజాన్నిపండించిన నటుడు శరత్ సక్సేనా గుర్తొస్తారు.

Sharat Saxena

అంతకుముందు బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’, నాగార్జున ‘నిర్ణయం’, చిరంజీవి ‘ఘరానా మొగుడు’ సినిమాల్లో నటించినా ఆయనకు ‘ముఠామేస్త్రి’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడి నుండి ‘మనీ’, ‘మనీ మనీ’, ‘బంగారు బుల్లోడు’, ‘గాంఢీవం’, ‘ఎస్.పి. పరశురామ్’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కొంత గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘బన్నీ’ సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేసి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sharat Saxena (@sharat_saxena)

ఇక హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాలు చేశారాయన. రీసెంట్‌గా శరత్ సక్సేనా వర్కౌట్స్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా వాళ్లకు ఫిజిక్ మెయింట్‌నెన్స్ అనేది చాలా ముఖ్యం. అయితే శరత్ సక్సేనా డెబ్భై ఏళ్లు దాటినా కూడా కండలు తిరిగిన బాడీతో కుర్రాడిలా కనిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sharat Saxena (@sharat_saxena)

ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి, నెటిజన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ జెనరేషన్ యూత్ సైతం మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలి.. ఏడు పదుల వయసు దాటినా.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు.. మీరు సూపర్ సార్’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘షేర్ని’ మూవీలో కనిపించారు శరత్ సక్సేనా..

 

View this post on Instagram

 

A post shared by Sharat Saxena (@sharat_saxena)