Bhola Shankar : మెగా టీజర్ కి డేట్ ఫిక్స్.. ఇక భోళాశంకరుడి జాతర షురూ..
భోళా శంకర్ మూవీ టీజర్ కి డేట్ ని ఫిక్స్ చేశాడు చిరంజీవి.

Chiranjeevi Bhola Shankar Teaser is ready to released on june 22
Chiranjeevi Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. ఈ సినిమాని ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు టీజర్ ని సిద్ధం చేస్తున్నారు.
Project K : ప్రాజెక్ట్ K టైటిల్ని రెడీ చేస్తున్న మేకర్స్.. అమెరికాలో టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్!
ఈ శనివారం (జూన్ 24) భోళా శంకర్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రం నిర్మాతలు తెలియజేశారు. అయితే ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనేది మాత్రం ప్రకటించలేదు. కాగా ఈ సినిమాని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) చిరంజీవికి జోడిగా కనిపించబోతుంది. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపిస్తుంది.
Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవ్వదా? మహేశ్ అభిమానుల్లో నిరాశ..
తమిళ్ సూపర్ హిట్ అయిన ‘వేదాళం’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవితో ఒక సపరేట్ కామెడీ ట్రాక్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆ సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా అలరించేలా మెహర్ తెరకెక్కించాడట. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ తరువాత ఈ మూవీ వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.
Get ready for an explosion of excitement and a MEGA CELEBRATION like never before ?
The electrifying #BholaaShankar Teaser on June 24th?
Mega?@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati @dudlyraj @AKentsOfficial… pic.twitter.com/rEK2ogkBH5
— AK Entertainments (@AKentsOfficial) June 22, 2023