Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

లైమ్ లైట్లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేసి కెరీర్ లో సెటిల్ అయిపోవాలనుకుంటారు. అందుకే పెళ్లి అనే మాటెత్తకుండా, లవ్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నారు హీరోయిన్లు.

Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

Cine Love Couples

Cine Love Couples: లైమ్ లైట్లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేసి కెరీర్ లో సెటిల్ అయిపోవాలనుకుంటారు. అందుకే పెళ్లి అనే మాటెత్తకుండా, లవ్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నారు హీరోయిన్లు. స్క్రీన్ మీద హీరోల కన్నా హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే కెరీర్ లో పడి పెళ్లిని కూడా పక్కన పెట్టేస్తారు. అలా అని లవ్, గివ్ లేదనుకుంటున్నారేమో.. పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి మాత్రం ఇప్పుడే వద్దనుకుంటున్నారు హీరోయిన్లు.

Raai Laxmi: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈలిస్ట్ లో యాడ్ అయ్యింది. తన బర్త్ డే కి బాయ్ ప్రెండ్ జక్కీ భగ్నానీని పరిచయం చేసిన ఈ ముద్దుగమ్మ.. లేటెస్ట్ గా పెళ్లి మీద ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రిలేషన్ లో ఉన్నా కూడా.. పెళ్లి మాత్రం ఇప్పుడే కాదని, అసలు పెళ్లిగురించి ఆలోచించే తీరిక లేదని, చేతినిండా సినిమాలతో సౌత్, నార్త్ లో ఫుల్ బిజీగా ఉన్నానంటోంది. పెళ్లి మాత్రం ఎప్పుడు చేస్కోవాలని పిస్తే అప్పుడే చేస్కుంటానని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

NTR 30: కొరటాల సినిమా కథ ఇదే.. రివీల్ చేసిన తారక్!

శృతిహాసన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రొఫెషనల్ గా బిజీ అవుతూనే.. అటు పర్సనల్ గా కూడా ఫుల్ గా ఎంగేజ్ అయిపోయింది. తను ప్రజెంట్ రిలేషన్ లో ఉన్న శంతనుతో టైమ్ స్పెండ్ చేస్తున్న ఫోటోలు, వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ కి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఈముద్దుగుమ్మ. పెళ్లి గురించి ఇప్పుడే ఏం ఆలోచించడం లేదని, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పెళ్ళి చేసేసుకుంటా అంటూ తేల్చేసింది శృతి హాసన్. ప్రజెంట్ శృతి ప్రభాస్, బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంది.

Avika Gor: అందంతో కట్టిపడేస్తున్న అవికా..!

సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ లైఫ్ స్టార్ట్ చేసింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్‌ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిపోయిన ఈ జంట.. పెళ్లిని మాత్రంహోల్డ్ లో ఉంచారు. ప్రస్తుతం కెరీర్ లో డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్నామని, ఆ తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు ఈ జంట.

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

మరో హీరోయిన్ తాప్సీ కూడా తన పెళ్లి మీద చాలా క్లియర్ గా ఉన్నానంటోంది. ఫారెన్ బ్యాడ్మింటన్ కోచ్ మథయాస్ బో తో రిలేషన్ లో ఉన్న తాప్సీ.. పెళ్లి గురించి మా ఇంట్లో కంగారు పడుతున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్నా కాబట్టి.. సంవత్సరానికి కనీసం రెండు సినిమా ఛాన్సులు కూడా రాకపోతే అప్పుడే పెళ్లిగురించి ఆలోచిస్తా అని ఫ్యాన్స్ కి చెప్పేసింది తాప్సీ.

Srikanth Iyengar: నలభై ఏడేళ్లకు బ్రేక్‌ వచ్చింది.. నిలబెట్టుకునేందుకే ప్రయత్నం

ఆలియా భట్ కూడా దాదాపు ఇదే స్టేజ్ లో ఉంది. పెళ్లి చేసుకోడానికి కరెక్ట్ టైమ్ వచ్చినా కూడా ఇంకా మ్యారేజ్ మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఆలియా. రణబీర్ సింగ్ తో లవ్ లో ఉన్న ఆలియా భట్.. ప్రజెంట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అని అందరూ అనుకోవడమే కానీ.. ఆలియా మాత్రం పెళ్లి ఎప్పుడన్నది మాత్రం చిన్నక్లూ కూడా ఇవ్వడం లేదు.