‘ఆర్ఆర్ఆర్’ – హాలీవుడ్ సినిమా పోస్టర్ లేపేశారంటగా!

‘ఆర్ఆర్ఆర్’ – హాలీవుడ్ సినిమా పోస్టర్ లేపేశారంటగా!

RRR Movie Poster: క్రియేటివ్ ఫీల్డ్‌లో కాపీ ఆరోపణలు కామనే అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే సామెత కూడా గుర్తుంచుకోవాలి.. అందుకే ఫిల్మ్ మేకర్స్ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి సీన్స్ రాసేటప్పుడు.. ఫ్రేమ్ పెట్టి షూట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు.. కొందరైతే ‘స్ఫూర్తి పొందాం’ అనే ఒక పదం వాడేసి తమకి నచ్చిన సీన్లు, పోస్టర్లు ఒరిజినల్ మాదిరిగానే వాడేస్తుంటారు.. ఇక టైటిల్ నుండి పోస్టర్ వరకు ఏ చిన్న పోలిక దొరికినా నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తుంటారు.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) కు మరోసారి కాపీ ఆరోపణలు ఎదురయ్యాయి.. ఇటీవల ఎన్టీఆర్ వీడియోలో చాలా షాట్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ నుండి లేపేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వెళ్తున్న స్టిల్ ఇరు హీరోల అభిమానులకు తెగ నచ్చేసింది. కాకపోతే నెటిజన్స్.. ఇదేదో బాగానే ఉంది కానీ ఎక్కడో చూసినట్టు ఉంది అంటూ నెట్లో సెర్చ్ చెయ్యడం స్టార్ట్ చేశారు.

కాసేపటికే ఇదిగో దొరికేసింది అంటూ ఓ హాలీవుడ్ సినిమా పోస్టర్ వెదికి, దీని కాపీనే ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హాలీవుడ్ సినిమా ఏంటంటే 2007 లో వచ్చిన ‘ఘోస్ట్ రైడర్’.. అందు‌లో ఓ ఘోస్ట్‌ రైడర్‌ గుర్రం స్వారీ చేస్తుండగా మరొకరు బైక్‌ రైడింగ్‌ చేస్తున్నారు. ఇందులో మండుతున్న నిప్పు ప్రత్యేక ఆకర్షణ.

అచ్చంగా అలాంటి కాన్సెప్టే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌లో ఉండటంతో రాజమౌళి మళ్లీ కాపీ కొట్టారంటూ కొందరు నెటిజన్లు బాహాటంగానే విమర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం కేవలం ఘోస్ట్‌ రైడర్‌ పోస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.