Bollywood : బాబోయ్ సెకండ్ వేవ్.. బెంబేలెత్తుతున్న బాలీవుడ్..

కరోనాతో సినిమా ఇండస్ట్రీ లాస్‌లోనుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తుందనుకుంటే మళ్లీ కేసులు పెరగడంతో షూటింగ్స్ దగ్గరనుంచి రిలీజ్ వరకూ మళ్లీ తిప్పలు తప్పడం లేదు. ఇలా బాలీవుడ్ మీద కోవిడ్ ఇంపాక్ట్ భారీగా పడుతోంది. వెయ్యి కోట్ల సినిమాల మార్కెట్‌ని చేతిలో పెట్టుకున్న బాలీవుడ్ ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయట పడబోతోంది..?

Bollywood : బాబోయ్ సెకండ్ వేవ్.. బెంబేలెత్తుతున్న బాలీవుడ్..

Corona Second Wave Effect On Bollywood

Bollywood: కరోనాతో సినిమా ఇండస్ట్రీ లాస్‌లోనుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తుందనుకుంటే మళ్లీ కేసులు పెరగడంతో షూటింగ్స్ దగ్గరనుంచి రిలీజ్ వరకూ మళ్లీ తిప్పలు తప్పడం లేదు. ఇలా బాలీవుడ్ మీద కోవిడ్ ఇంపాక్ట్ భారీగా పడుతోంది. వెయ్యి కోట్ల సినిమాల మార్కెట్‌ని చేతిలో పెట్టుకున్న బాలీవుడ్ ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయట పడబోతోంది..?

83

బాలీవుడ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ స్పీడప్, వరుస రిలీజ్‌లతో బిజీగా ఉంది. బ్యాక్ టు నార్మల్ అనుకుంటున్న టైమ్‌లోనే.. మరోసారి సెకండ్ వేవ్ సీరియస్‌గా దెబ్బకొట్టింది. ట్రేడ్ ఎస్టిమేషన్‌లో దాదాపు వచ్చే మూడు నెలల్లో వెయ్యి నుంచి 1200 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న సినిమాలతో బిజినెస్ రెడీగా ఉంది బాలీవుడ్‌కి.

Radhe

కోట్లకు కోట్ల మార్కెట్ ఉన్న సినిమాల రిలీజ్ ఆపేస్తే బిజినెస్ ఎలా రన్ అవుతుంది..? బాలీవుడ్ ఎలా రికవర్ అవుతుందని తెగ ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నెమ్మదిగా చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా వరుసగా మార్చి నుంచి ఈ సంవత్సరం చివరి వరకూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేశాయి. కానీ వాటిలో ఏ స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో రిలీజ్ కావల్సిన ‘83’ సినిమాకి ఈ సంవత్సరం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది.

Chehre

ఇప్పటికే ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘సూర్యవంశీ’ తో పాటు ‘బంటీ ఔర్ బబ్లీ 2’, అమితాబ్ బచ్చన్ ‘చెహ్రా’ సినిమాల్ని పోస్ట్‌పోన్ చేసేశారు. ఎట్టి పరిస్థితిలో మే 13 రంజాన్‌కు సినిమా రిలీజ్ చేస్తానని చెప్పిన సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమా రిలీజ్ కూడా ఇప్పుడు వాయిదా పడింది.. ఇక ఈ సినిమాలు రిలీజ్ అయితే మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని, పనిలో పనిగా నిర్మాతలు ఓటీటీల వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Sooryavanshi

లాస్ట్ ఇయర్ లాస్‌ని ఈ సంవత్సరం కాస్తైనా కవర్ చేసుకుందామనుకున్న బాలీవుడ్‌‌కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ధియేటర్ల బంద్‌తో, సినిమాలు, రిలీజ్‌లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో మళ్లీ పబ్లిసిటీ, ప్రమోషన్లకు ఖర్చు పెట్టాలని వర్రీ అవుతున్నారు మేకర్స్. అంతేకాదు.. ఒకరి తర్వాత ఒకరు స్టార్లందరూ కోవిడ్ బారిన పడడంతో షూటింగ్స్ కూడా షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వస్తోంది. మరి ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో, నష్టాన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థంకాక బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు..

Bunty Aur Babli 2