Bollywood Movies: థర్డ్ వేవ్ తిప్పలు.. బాలీవుడ్‌కు మళ్ళీ గతేడాది పరిస్థితులు!

సినిమాకి మళ్లీ మంచిరోజులొచ్చాయని ఆనందపడినంత సేపు పట్టలేదు. ధియేటర్లు మళ్లీ నిండుతున్నాయన్న సంతోషం 4 నెలలు కూడా నిండలేదు. అంతలోనే రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..

Bollywood Movies: థర్డ్ వేవ్ తిప్పలు.. బాలీవుడ్‌కు మళ్ళీ గతేడాది పరిస్థితులు!

Bollywood Movies

Bollywood Movies: సినిమాకి మళ్లీ మంచిరోజులొచ్చాయని ఆనందపడినంత సేపు పట్టలేదు. ధియేటర్లు మళ్లీ నిండుతున్నాయన్న సంతోషం 4 నెలలు కూడా నిండలేదు. అంతలోనే రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ధియేటర్ల బంద్ లు, పోస్ట్ పోన్ అవుతున్న సినిమాలతో.. 2020 నాటి సీన్ రిపీట్ అవుతోంది బాలీవుడ్ లో. కోవిడ్ దెబ్బకి బాలీవుడ్ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్ గా ధియేటర్లు ఓపెన్ అయ్యాయి.. ఇక సినిమాలకు మళ్లీ మంచి రోజులొచ్చాయని తెగ ఆనందపడ్డారు బాలీవుడ్ జనాలు.

Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

కానీ అంతలోనే థర్డ్ వేవ్ తిప్పలు తెచ్చిపెట్టింది. మళ్లీ విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ధియేటర్లు మూత పడుతున్నాయి.. సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ 2020 నాటి సిచ్యవేషన్ ఫేస్ చేస్తోంది బాలీవుడ్. ఇలాంటి సిచ్యవేషన్ లో సినిమాలు రిలీజ్ చెయ్యడం కష్టమని ఇప్పటికే జెర్సీ, ట్రిపుల్ఆర్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి.

NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

జనవరిలో బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లు పెట్టుకుంది బాలీవుడ్. ఈనెలలో అక్షయ్ కుమార్ పృద్విరాజ్ సినిమాతో పాటు జాన్ అబ్రహం ఎటాక్ మూవీ రిలీజ్ కావల్సి ఉంది. అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ జంటగా మారాఠా యోధుడు పృధ్విరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పృద్విరాజ్ మూవీ ఈ నెల 21న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. కానీ కోవిడ్ వల్ల కొన్నిచోట్ల ధియేటర్లు మూతపడడం, కొన్ని చోట్ల 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే నడపడంతో సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు టీమ్.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

2020లో కూడా ధియేటర్లు ఇలాంటి పరిస్తితులే ఎదుర్కోవడంతో సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. లేటెస్ట్ గా జాన్ అబ్రహం ఎటాక్ మూవీ కూడా రిలీజ్ వాయిదా వేసుకుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా జనవరి 26న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా కోవిడ్ ఎఫెక్ట్ తో మరోసారి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ సినిమాలే కాదు.. అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా.. దాదాదాపు వచ్చే నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా వాయిదా పడుతాయంటున్నారు బాలీవుడ్ జనాలు.