Dussehra Telugu Films: టీజర్లు, పోస్టర్లు, పాటలతో సందడిగా దసరా!

ప్రతి సంవత్సరం వచ్చే పండగ అయినా.. సెకండ్ వేవ్ తరవాత వచ్చిన ఈ దసరా సినిమా వాళ్లకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ధియేటర్లో జనాలు, రిలీజ్ కు రెడీగా సినిమాలు, సందడి చేస్తున్న ప్రమోషన్లతో..

Dussehra Telugu Films: టీజర్లు, పోస్టర్లు, పాటలతో సందడిగా దసరా!

Dussehra Telugu Films (1) (1)

Dussehra Telugu Films: ప్రతి సంవత్సరం వచ్చే పండగ అయినా.. సెకండ్ వేవ్ తరవాత వచ్చిన ఈ దసరా సినిమా వాళ్లకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ధియేటర్లో జనాలు, రిలీజ్ కు రెడీగా సినిమాలు, సందడి చేస్తున్న ప్రమోషన్లతో ఫుల్ సందడిగా ఉంది టాలీవుడ్. మరి ఈ పండగ రోజు రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లు, పాటలేంటో చూద్దాం.

Dhamaka: ఎనర్జీకి తగ్గ టైటిల్ ధమాకా.. డ్యూయెల్ రోల్ మరో బోనస్!

టాలీవుడ్ లో దసరా పండగ సందడి ఫుల్ జోష్ లో ఉంది. రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు.. రిలీజ్ కాబోయే కొత్త సినిమాలకు సంబందించి ట్రైలర్లు, టీజర్లు, పాటలు ఫుల్ హడావిడి చేస్తున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఫస్ట్ సాంగ్ తోనే రికార్డులు బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్.. ఈసారి మంచి మెలొడీతో ఆడియన్స్ ని టీజ్ చేస్తున్నాడు.

AnthaIshtam: అంత ఇష్టం ఏందయ్యా నీకు.. భీమ్లా నుండి ఫీల్ గుడ్ మెలోడీ!

సౌత్ సూపర్ స్టార్ తలైవా పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేసిన అన్నాత్తే సినిమాకు సంబందించి ఒకరోజు ముందే టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ పండగరోజున తెలుగు టైటిల్ తో మరో పోస్టర్ ను విడుదల చేసింది. మీనా, ఖుష్బూ, కీర్తిసురేష్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో.. రజనీ తన ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేలా అన్ని ఎలిమెంట్స్ తో ప్యాక్ చేశారు.

Annaatthe: టైటిల్ కన్ఫర్మ్.. ‘పెద్దన్న’గా తలైవర్!

ఎంటర్ టైన్ మెంట్.. ఎంటర్ టైన్ మెంట్.. ఎంటర్ టైన్ మెంట్. ఈ చిన్న ఫార్ములా మీద కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్న మారుతి.. తన స్కూల్ నుంచి మంచిరోజులొచ్చాయి అనే లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ యు.వి ప్రొడక్షన్స్ లో తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ కోసం కొత్త గెటప్!

వీటితో పాటు మాస్ మహారాజా త్రినాధరావుతో తెరకెక్కే సినిమాకు ‘ధమాకా’ అని తన ఎనర్జీకి తగ్గట్లే టైటిల్ రివీల్ చేయగా.. ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇవి కాకుండా శవానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’, నాగ శౌర్య ‘లక్ష్య’లతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా కొత్త పోస్టర్లు విడుదల చేసి ప్రేక్షకులను దసరా శుభాకాంక్షలు తెలిపారు.