Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ కోసం కొత్త గెటప్!

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నా.. క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ చూపిస్తున్న ప్రభాస్.. ఈ సారి ఫస్ట్ టైమ్ సరికొత్తగా ఆడియన్స్ కి పరిచయం..

Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ కోసం కొత్త గెటప్!

Prabhas: కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నా.. క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ చూపిస్తున్న ప్రభాస్.. ఈ సారి ఫస్ట్ టైమ్ సరికొత్తగా ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 4 సినిమాల్లో కంప్లీట్ కాంట్రాస్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ 5వ సినిమాలో మాత్రం అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

Prabhas: చేతినిండా సినిమాలు.. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు?

ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే.. ఆడియన్స్ కి కూడా బోరే. ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ అయినా రొటీన్ ఫీల్ అవుతారు. అందుకే ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ కి ఎప్పటి కప్పుడు ఫ్రెష్ నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అందుకే సందీప్ రెడ్డితో చేస్తున్న తన సిల్వర్ జూబ్లీ మూవీలో సరికొత్త గెటప్ లో అంతుకుముందెప్పుడూ ఆడియన్స్ చూడని పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

ప్రభాస్ ఇప్పటి వరకూ ఫుల్ ప్లెడ్జ్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించలేదు. సో.. సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ మూవీలో పోలీస్ గా కనిపించబోతున్నారు ప్రభాస్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న 5 సినిమాలకు సంబందించి 5 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. సలార్ లో స్ట్రాంగ్ మాస్ నేటివిటీ ఉన్న రా క్యారెక్టర్ చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ ఉన్న రాధేశ్యామ్ లో హార్డ్ కోర్ లవర్ బాయ్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

Prabhas: రెబల్ స్టార్ సినిమాల లైనప్.. సాహో అనాల్సిందే!

ఒక వైపు లవర్ బాయ్ గా కనిపిస్తూ.. మరో వైపు దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు ప్రభాస్. ఓమ్ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా నెవర్ బిఫోర్ లుక్ తో సర్ ప్రైజ్ చెయ్యబోతున్నాడు. నాగాశ్విన్ తో తెరకెక్కుతున్న సైఫై డ్రామా మూవీ ప్రాజెక్ట్ కె లో మరో కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇలా ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా తన క్యారెక్టర్ స్ ని సరికొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.