Car Like Election Symbols : మరోసారి టీఆర్ఎస్‌కు షాక్.. మునుగోడులో ఆ కారణంగా 6వేలకు పైగా ఓట్లు లాస్

ఎప్పటిలాగే మరోసారి మునుగోడు ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అది సింబల్ రూపంలో. టీఆర్ఎస్ పార్టీ సింబల్ కారుని పోలిన గుర్తుల కారణంగా టీఆర్ఎస్ కు నష్టం జరిగిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Car Like Election Symbols : మరోసారి టీఆర్ఎస్‌కు షాక్.. మునుగోడులో ఆ కారణంగా 6వేలకు పైగా ఓట్లు లాస్

Car Like Election Symbols : తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చేసింది. మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ జయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 14 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామమాత్రంగా నిలిచారు.

14 రౌండ్ల అనంతరం కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా.. రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న పాల్వాయి స్రవంతి 21,243 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కేవలం 2, 3వ రౌండ్ లోనే బీజేపీకి మొగ్గు కనిపించింది. అది మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజ వేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉపఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు తినిపించుకున్నారు. టపాసుల కాల్చి ఎంజాయ్ చేశారు.

కాగా, ఎప్పటిలాగే మరోసారి మునుగోడు ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అది సింబల్ రూపంలో. టీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు. ఆ కారు గుర్తుని పోలిన గుర్తుల కారణంగా టీఆర్ఎస్ కు నష్టం జరిగిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన కొన్ని సింబల్స్ ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి. రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటి గుర్తులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు వచ్చాయని.. లేదంటే తమ మెజార్టీ మరింత పెరిగేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం గతంలో రద్దు చేసిన కొన్ని గుర్తులను కూడా మళ్లీ తెచ్చారని, మునుగోడులో గెలిచేందుకు బీజేపీ ఎన్నో నాటకాలు, డ్రామాలు, కుట్రలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

కాగా, మునుగోడు ఉపఎన్నికకు ముందే.. ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటమూ చేసింది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది. పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు.

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ వాదించింది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.

మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. అందువల్ల కారును పోలిన ఆ ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరారు.