Jeedi Mamidi Cultivation : అధిక దిగుబడి కోసం పూతదశలో జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల, వాతావరణం మీద భారం వేసి, ఏటా వచ్చినకాడికి దిగుబడి తీసుకోవటం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, జీడిమామడి నుంచి వచ్చే ఆదాయానికి, మరో పంట సాటి రాదంటున్నారు .

Jeedi Mamidi Cultivation : అధిక దిగుబడి కోసం పూతదశలో జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

Jeedi Mamidi Cultivation :

Jeedi Mamidi Cultivation : అధిక వాణిజ్య విలువ వున్న పంట జీడిమామిడి. మన దేశం జీడిమామిడి విస్తీర్ణంలో ను, ఉత్పాదకతలోను ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గిరాకీ వున్న వాణిజ్యపంటగా గుర్తింపు పొందింది జీడిమామిడి. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు వున్న తీరప్రాంత భూముల్లో సుమారు లక్షా 27 వేల హెక్టార్ల విస్తీర్ణంలో జీడిమామిడి సాగవుతోంది.

తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి . అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టారుకు 646కిలోలు మాత్రమే ఉంది . యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణపట్ల అవగాహన లోపం వల్ల, రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది.

READ ALSO : Tea Mosquito : జీడిమామిడిలో నష్టం కలిగించే తేయాకు దోమ! నివారణ చర్యలు

విస్తీర్ణం అధికంగా వున్నా.. సగటు దిగుబడి చాలా తక్కువ వుండటంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. కొండవాలు భూముల్లో ఎకరాకు 80 నుంచి 100 జీడి మొక్కల చొప్పున పెంచుతున్నారు. ఎర్రగరప నేలలు, ఇసుక భూముల్లో ఈ తోటల పెరుగుదల ఆశాజనకంగా వుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో జీడితోటలు చిగురు దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పూతదశలో ఉన్నాయి . నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడిపిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించటం లేదు.

చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల, వాతావరణం మీద భారం వేసి, ఏటా వచ్చినకాడికి దిగుబడి తీసుకోవటం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, జీడిమామడి నుంచి వచ్చే ఆదాయానికి, మరో పంట సాటి రాదంటున్నారు . గుంటూరు జిల్లా బాపట్ల జీడిమామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఉమామహేశ్వరరావు . పూత దశలో వున్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలపై రైతులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

READ ALSO : Cashew : జీడి మామిడిలో పూత,కాత దశలో సస్యరక్షణ

జీడిమామిడి తోటలకు అదునులో ఎరువులను అందించని రైతులు, ప్రస్థుతం పాలియార్ స్ర్పే రూపంలో ఎరువులను ఆకుల ద్వారా అందించవచ్చు. దీనివల్ల పూతకొమ్మలు సమృద్ధిగా వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది. జీడితోటల్లో… నాటిన 5 సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 8- 10 కిలోల జీడిపిక్కల దిగుబడి వస్తుంది . 10 సంవత్సరానికి 15 కిలోల దిగుబడినిచ్చే సామర్ధ్యం ప్రతి చెట్టుకు వుంది.

ఎకరాకు కనీసంగా లక్ష రూపాయల నికర రాబడిని సాధించే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఏటా తోటల యాజమాన్యంలో సకాలంలో సరైన చర్యలు చేపట్టాలని బాపట్ల జీడిమామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి.