Zika Virus: తిరువనంతపురంలో మరో 14 జికా వైరస్ కేసులు.. లక్షణాలివే..

కేరళలో జికా వైరస్ కేసులు రెండో రోజుకు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పరస్సాలాలో ఉండే 24 సంవత్సరాల గర్భిణీకి వైరస్ పాజిటివ్ వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులు హెల్త్ వర్కర్లలోనే ఎక్కువగా కనిపించాయి.

Zika Virus: తిరువనంతపురంలో మరో 14 జికా వైరస్ కేసులు.. లక్షణాలివే..

Zika Virus

Zika Virus: కేరళలో జికా వైరస్ కేసులు రెండో రోజుకు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పరస్సాలాలో ఉండే 24 సంవత్సరాల గర్భిణీకి వైరస్ పాజిటివ్ వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులు హెల్త్ వర్కర్లలోనే ఎక్కువగా కనిపించాయి. ఈ పేషెంట్ల శాంపుల్స్‌ను పూణెలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.

వారందరికీ పాజిటివ్ రావడంతో ట్రీట్మెంట్ అందిస్తుండగా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు గురించి విచారించిన అధికారులకు ఇటీవల కాలంలో ఆమె ఎటూ ప్రయాణించినట్లు తెలియలేదని చెప్పారు.

దోమకాటుపై జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఓ కన్నేసి ఉంచాలని అన్ని జిల్లా అడ్మినిస్ట్రేటర్లకు అలర్ట్ పంపించారు. అత్యవసరమైన ఫ్యూమిగేషన్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉండేలా చూడాలని అన్నారు.

ఈ జికా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా మందిలో దీని లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రం తలనొప్పి, జ్వరం, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పి కనిపిస్తాయి. గర్భిణీల నుంచి కడుపులో ఉన్న బిడ్డకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆ పిండం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ కు సంబంధించి ఎటువంటి మెడిసిన్ ను గుర్తించలేకపోయారు వైద్యులు.