SSMB 28 : మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. మహేష్, మాటల మాంత్రికుడు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు..

SSMB 28 : మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా..!

Ssmb 28

SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. మహేష్, మాటల మాంత్రికుడు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ TRP రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Mahesh Babu - Trivikram

‘ఖలేజా’ కాస్త నిరాశపరిచినా సూపర్ స్టార్‌లోని సరికొత్త కామెడీ కోణాన్ని చూపించారు త్రివిక్రమ్.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది.. మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది.. ఇప్పుడు చేస్తున్న ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తర్వాత SSMB 28 స్టార్ట్ కానుంది..

Ssmb 28

త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత ఎస్. రాధ కృష్ణ (చినబాబు) హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, 2022 వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని వీడియో రిలీజ్ చేశారు..