Movie Budgets Hike: తడిసిమోపెడవుతున్న బడ్జెట్.. హీరోల రెమ్యునరేషనే కారణం!

సినిమాల బడ్జెట్ పెరిగిపోతోంది. ఒకప్పుడు 10 కోట్లున్న బడ్జెట్ ఇప్పుడు వందల కోట్లకి బడ్జెట్ రేంజ్ పెరిగిపోయింది. నిజానికి సినిమా తియ్యడానికి అన్ని కోట్లు అవసరం లేదు. ఈ వందల కోట్ల..

Movie Budgets Hike: తడిసిమోపెడవుతున్న బడ్జెట్.. హీరోల రెమ్యునరేషనే కారణం!

Movie Budgets Hike

Movie Budgets Hike: సినిమాల బడ్జెట్ పెరిగిపోతోంది. ఒకప్పుడు 10 కోట్లున్న బడ్జెట్ ఇప్పుడు వందల కోట్లకి బడ్జెట్ రేంజ్ పెరిగిపోయింది. నిజానికి సినిమా తియ్యడానికి అన్ని కోట్లు అవసరం లేదు. ఈ వందల కోట్ల బడ్జెట్ లో రెమ్యూనరేషన్ కోసమే సగం బడ్జెట్ సరిపోతుంది. ఇలా హీరోలు హిట్లున్నా, లేకపోయినా.. సినిమాలున్నా, లేకపోయినా.. సినిమా సినిమాకీ రెమ్యూనరేషన్ పెంచేయడంతో ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ సౌత్ టూ నార్త్ చర్చ జరగుతోంది.

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

ఎక్కడ చూసినా హీరోల రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ అయినా అది హీరోల రెమ్యూనరేషన్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. లేటెస్ట్ గా టిక్కెట్ రేట్స్ తగ్గించడంతో నిర్మాతలు నష్టపోతున్నారని రేట్స్ అడ్జస్ట్ చెయ్యాలంటూ హీరోలు మాట్లాడుతుంటే.. మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అంతా సెట్ అయిపోతుందంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు.

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

ఈ రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ ఇక్కడే కాదు.. బాలీవుడ్ లో కూడా గట్టిగానే ఫేస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్.. కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా బడ్జెట్ పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్. ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే 20 పర్సెంట్, 30 పర్సెంట్ రెమ్యూనరేషన్ పెంచేయడంతో బడ్జెట్ తడిసి మోపెడవుతోందన్నారు కరణ్. అంతేకాదు.. అసలు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ విషయంలో హీరోలు అసలు ఏమాత్రం తగ్గడం లేదంటున్నారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన కరన్ జోహార్.

Bollywood Stars: ఛలో ఫారిన్.. సెలబ్రిటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

స్టార్ హీరోలే కాదు.. రెండు మూడు సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలు కూడా విపరీతంగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారని, అసలు లాస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదంటున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఆఫర్స్ ని కన్సిడర్ చేస్తూ.. రెమ్యూనరేషన్ రోజురోజకీ పెంచేస్తున్నారని దాంతో సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోతోందని ఓపెన్ అయ్యారు స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.