KGF2: ఆగని రాఖీభాయ్ దూకుడు.. బాలీవుడ్‌లో పర్ఫామెన్స్ పీక్స్!

KGF2: ఆగని రాఖీభాయ్ దూకుడు.. బాలీవుడ్‌లో పర్ఫామెన్స్ పీక్స్!

Kgf2 First Week Collections

KGF2: సాలిడ్ ట్రైలర్ తోనే థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడంటూ కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు పెంచేశాడు. పెట్టుకున్న టార్గెట్ అవలీలగా రీచ్ అయిపోయాడు. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. రికార్డులు బ్రేక్ చేసుకుంటూ అంచనాలకే అందకుండా పాన్ ఇండియా మార్కెట్లోకి దూసుకెళ్లిన యశ్. కేజిఎఫ్ 2 సాధించిన కలెక్షన్స్, రికార్డ్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం.

KGF2: ఆగని వసూళ్ల ప్రభంజనం.. రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రాఖీభాయ్!

రిలీజ్ అయిన 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన కేజిఎఫ్ 2, అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఆడియన్స్ తో పాటు స్టార్స్ ను షాక్ కి గురి చేసింది. బాహుబలి 2 తర్వాత సీక్వెల్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా కేజిఎఫ్2ని నిలబెట్టారు గ్లోబల్ ఆడియన్స్. చిన్న ఇండస్ట్రీ.. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజిఎఫ్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాని సీక్వెల్ తో ఈ ఇయర్ ఏప్రిల్ 14న వచ్చిన కేజిఎఫ్2, కేజిఎఫ్ ఫుల్ టైమ్ కలెక్షన్స్ మొత్తం వన్ డేలోనే క్రాస్ చేసి, తన రికార్డు తానే బ్రేక్ చేశాడు యశ్.

KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!

ఇండియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ 2 పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంది. ఫస్ట్ డే 63 కోట్ల 66 లక్షల వసూళ్లు సాధించి, హిందీ సినిమా డే1 కలెక్షన్స్ రికార్డును కొల్లగొట్టింది. ఇప్పటి వరకు 353 కోట్లకు పైగా హిందీ లో కలెక్షన్స్ సాధించి, అదర్ లాంగ్వేజ్ మూవీ అత్యధిక కలెక్షన్స్ తో రికార్డు సెట్ చేసింది. ఇక కర్ణాటకలో ఆల్ టైమ్ ఓపెనింగ్స్ సాధించిన కేజిఎఫ్ 2 కేరళలో ఆల్ టైమ్ అత్యధిక కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా కలుపుకుని, వరసగా నాలుగు రోజులు వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మరో రికార్డునూ కైవసం చేసుకుంది కేజిఎఫ్ 2.

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

యాక్షన్ సీక్వెన్సెస్, మాసివ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ సౌత్ తో పాటూ ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ కోరుకుంటున్నట్టు కంప్లీట్ మాస్ పీరియాడికల్ డ్రామాగా కేజీఎఫ్2ను రెడీ చేశారు మేకర్స్. వావ్ అనిపించే ఎలివేషన్స్ తో అట్రాక్ట్ చేశాడు రాఖీబాయ్. దాంతో సినిమా రిలీజ్ అయిన వన్ వీక్ లోనే ఫాస్టెస్ట్ గా 250 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిపోయిన స్టార్ గా ఫీట్ సాధించాడు.

KGF2: ‘ఆర్ఆర్ఆర్’ను టచ్ చేయలేకపోయిన కేజీయఫ్-2

ఇండియా వైడ్ ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు బాహుబలి2, దంగల్, ట్రిపుల్ ఆర్, వాటి తర్వాత ఏప్రిల్ 29 నాటి కలెక్షన్స్ తో 1008.5 కోట్ల గ్రాస్, 714 కోట్ల నెట్ కలెక్షన్స్ తో కేజిఎఫ్ 2 కూడా వెయ్యికోట్ల క్లబ్ లో చేరడంతో కేజిఎఫ్ టీమ్ తో పాటు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.