KGF2: ‘ఆర్ఆర్ఆర్’ను టచ్ చేయలేకపోయిన కేజీయఫ్-2

ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను తాజాగా ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2 వంటి సినిమాలు కూడా...

KGF2: ‘ఆర్ఆర్ఆర్’ను టచ్ చేయలేకపోయిన కేజీయఫ్-2

RRR-KGF2

KGF2: ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను తాజాగా ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2 వంటి సినిమాలు కూడా కంటిన్యూ చేస్తూ తమ సత్తా చాటుతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సౌత్ సినిమాలు దూసుకుపోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒక సినిమా సెట్ చేసిన రికార్డులను మరో సినిమా ఓవర్‌టేక్ చేస్తూ వెళ్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

KGF2: కేజీయఫ్2 8 రోజుల కలెక్షన్లు.. తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా తరువాత రిలీజ్ అయిన కేజీయఫ్-2 కూడా అదే స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టిన కేజీయఫ్-2, వరల్డ్‌వైడ్‌గా ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించడం ఖాయమని చిత్ర వర్గాలు అనుకున్నాయి. కానీ ఒకచోట మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ను ఓవర్‌టేక్ చేయడం కాదు కదా.. కనీసం ఆర్ఆర్ఆర్ దరిదాపుల్లో కూడా కేజీయఫ్-2 నిలబడలేకపోయింది.

KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?

పాన్ ఇండియా మూవీలుగా వస్తున్న సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ డిమాండ్ ఉంది. అక్కడి ఆడియెన్స్ ఈ సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా యూఎస్‌లో ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు అధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 నిలిచింది. ఏకంగా 20.5 మిలియన్ డాలర్లతో టాప్ స్థానంలో బాహుబలి-2 ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ దాని తరువాత స్థానంలో 14 మిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత బాహుబలి-1 మూడో ప్లేస్‌లో ఉంది. అయితే కేజీయఫ్-2 అక్కడ ఇప్పటివరకు 6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. టోటల్ రన్‌లో మహాఅయితే మరో 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అంటే.. ఈ లెక్కన ఓవర్సీస్‌లో కేజీయఫ్-2 మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను బీట్ చేయడం కాదు కదా.. దాన్ని టచ్ కూడా చేయలేదని ఈ లెక్కలు చూస్తే తెలుస్తోంది.