KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?

కెజిఎఫ్.. ఇండియన్ సినిమాకే హైలెట్ అయిన కన్నడ సినిమా. రికార్డుల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో..

KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?

Kgf2

KGF2: కెజిఎఫ్.. ఇండియన్ సినిమాకే హైలెట్ అయిన కన్నడ సినిమా. రికార్డుల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. వడ్రంగి పనిచేస్తూ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి గురించి, వాచ్ లు రిపేర్ చేస్తూ సినిమాటోగ్రఫీ చేసిన భువన్ గురించి, మీసాలు రాకుండానే ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన ఉజ్వల్ గురించి అంత కంటే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అసలు ఈముగ్గుర్నీ ప్రశాంత్ ఎలా పట్టుకున్నాడు..?

KGF2-Beast: రాఖీభాయ్ విజయం.. బీస్ట్ దర్శకుడిపై ఆగ్రహం!

కెజిఎఫ్.. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే. ఏరికార్డులు అయినా ఈ సినిమా తర్వాతనే.. ఆ రేంజ్ లో కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో వరల్డ్ వైడ్ గాదూసుకుపోతోంది. కెజిఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాలు అంతకుముందు కూడా వచ్చాయి.. కానీ కెజిఎఫ్ మాత్రమే ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యింది..? కేజిఎఫ్ కి మాత్రమే ఇంత సక్సెస్, ఇన్ని కలెక్షన్లు ఎలా వస్తున్నాయి..? వీటన్నిటికీ సమాధానం.. సినిమాని జస్ట్ సినిమా లాగా కాకుండా.. ఓ తపస్సు లా, ఓ యజ్ఞంలా చేసిన కెజిఎఫ్ యంగ్ టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ ది.

KGF2: 8 ఏళ్ళ ప్రయాణం.. రాఖీ భాయ్ రికార్డుల వెనక కష్టం తెలుసా?

కెజిఎఫ్ టీమ్ లో ప్రశాంత్ నీల్, యష్ తర్వాత అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నది.. హాట్ టాపిక్ అవుతున్నది ముగ్గురు. కెజిఎఫ్ మ్యజిక్ డైరెక్టర్ రవి, సినిమాటోగ్రాఫర్ భువన్, ఎడిటర్ ఉజ్వల్. అసలు కెజిఎఫ్ స్టోరీకి అంత ఎలివేషన్ ఇచ్చింది, సినమాకి మేజర్ ఎసెట్ అయ్యింది మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర రవికి ఇది రెండో సినిమా. వడ్రంగి పనిచేసుకుంటూ ఉండే రవి టాలెంట్ చూసి ఆఫర్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

KGF2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా?

బెంగుళూరులో తన తండ్రితో పాటు వడ్రంగ పని, దేవుడి నగలు చేసే రవి.. మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ తో సొంతంగా కొన్ని దేవుడి పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవారు. వాటితో పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ముంబై వెళ్లి అవకాశాల కోసం వెతుక్కున్నారు. అక్కడా అంతగా పనిదొరక్క పోవడంతో మళ్లీ బెంగుళూరు వచ్చి రోజుకి 35 రూపాయలకి వండ్రంగి పనిచేసుకున్నారు. ఆ తరవాత ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ మూవీ ఉగ్రమ్ కి ఛాన్సిచ్చారు. అక్కడినుంచి కెజిఎఫ్ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు రవి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కి రవి ఇచ్చిన మ్యూజిక్ అన్ డౌటెడ్ లీ ఎసెట్ అనే చెప్పాలి. సినిమా ఈరేంజ్ లో సక్సెస్ అయ్యిందంటే మేజర్ క్రెడిట్ డైరెక్టర్ తర్వాత రవిదే.

KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

కెజిఎఫ్ లో హీరో ఎమోషన్ ని క్యారీ చేసింది సినిమాటోగ్రఫీ. బంగారు గనులు, అక్కడ మట్టికొట్టుకుపోయిన మనుషులు ఇవన్నీ అదే ఎమోషన్ తో ప్రేక్షకులకు చూపించాలి. ప్రశాంత్ నీల్ విజన్ ని సరిగా ఇలాగే క్యాచ్ చేశారు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ. భువన్ కి కూడా కెజిఎఫ్ రెండో సినిమా. వాచ్ రిపేర్ షాప్ లో పనిచేసే భువన్.. తన ఫ్రెండ్ కెమెరాతో ఫోటోలు తియ్యడం నేర్చుకుని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కిందా మీదా పడుతున్నారు. అయితే భువన్ గౌడలో టాలెంట్ చూసిన ప్రశాంత్.. తన ఫస్ట్ సినిమా ఉగ్రమ్ లో ఛాన్సిచ్చారు. స్టిల్ ఫోటో గ్రాఫర్ అయినా కూడా కెజిఎఫ్ లో ఆ రస్టిక్ లుక్, ఫ్రేమింగ్, లైటింగ్, టింట్ తో సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లారు. 8 ఏళ్ల నుంచి కెజిఎఫ్ తో పాటే ట్రావెల్ అవుతున్నారు భువన్ గౌడ. ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించడానికి రాలేదని, తన పనిని జనాలు ఆదరిస్తే ఛాలంటున్నారు భువన్. సినిమా గురించి ఓపిగ్గా ప్రశాంత్ అన్నీ చెప్పేవారని, దగ్గరుండి పని నేర్పించే వారని తన ఎక్స్ పీరియన్స్ షేర్ చేశారు భువన్ గౌడ.

KGF2: కేజీఎఫ్ ప్రకంపనలు.. ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్స్!

అసలు సినిమా ఎంత గొప్పగా తీసినా.. దాన్ని ఆడియన్స్ కి ఇంట్రస్ట్ కలిగించేలా చెప్పగలగాలి. క్రిస్ప్ గా షార్ప్ గా పాయింట్ టూ పాయింట్ డెలివర్ చెయ్యగలగాలి. అప్పుడే ప్రేక్షకులకి సినిమా మీద ఇంట్రస్ట్ కలుగుతుంది. ఆ పనిని అంతే కరెక్ట్ గా చేశారు 20 ఏళ్ల ఉజ్వల్ కులకర్ణి. 19 ఏళ్ల ఉజ్వల్ కులకర్ణి చిన్న చిన్న వీడియో ఎడిట్స్ తో పాటు ఫాన్ వీడియోలు చేస్తూండేవాడు. ఉజ్వల్ ఎడిట్స్ చూసి ఇంప్రెస్ అయిన ప్రశాంత్ నీల్ కెజిఎ ఫ్ 1 టైమ్ లోనే ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి లేటెస్ట్ గా వచ్చిన కెజిఎఫ్ 2 వరకూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ అదిరిపోయే ఎడిటింగ్ తో సినిమాకి వన్ ఆఫ్ ద సక్సెస్ ఎలిమెంట్ అయ్యాడు.