KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్-2’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్....

KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

KGF3

KGF2: రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్-2’ ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. ఇక ‘కేజీయఫ్ చాప్టర్-1’కు దక్కిన రెస్పాన్స్ కారణంగా కూడా ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు తొలిరోజునే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

ఇక వారు అనుకున్నట్లుగానే కేజీయఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేస్తోంది. ఈ సినిమా రిలీజ్ రోజునే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి తన సత్తా చాటింది. ఇక కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్లకుపైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో చూపించింది. తాజాగా ఈ సినిమా 5 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.625 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా గ్రాస్ పరంగా ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ టెన్ మూవీస్ జాబితాలో చేరిపోయింది.

అటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ, మిగతా సినిమాలను తొక్కుకుంటూ వెళ్తోంది. యశ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్, ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్ కలగలిసి, ఈ సినిమాను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడేలా చేశాయి. మరి ఈ సినిమా ఇలాగే తన జోరును కొనసాగిస్తే అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ‘కేజీయఫ్ చాప్టర్ 2’ 5రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.30.63 కోట్లు
సీడెడ్ – రూ.8.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.5.34 కోట్లు
ఈస్ట్ – రూ.3.98 కోట్లు
వెస్ట్ – రూ.2.43 కోట్లు
గుంటూరు – రూ.3.25 కోట్లు
కృష్ణా – రూ.2.92 కోట్లు
నెల్లూరు – రూ.1.94 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.58.66 కోట్లు(షేర్) (రూ.93 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.58.60 కోట్లు
తమిళనాడు – రూ.18.25కోట్లు
కేరళ – రూ.14.20 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా – రూ.110 కోట్లు
ఓవర్సీస్ – రూ.51.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.311.15 (షేర్) (రూ.625.12 కోట్లు గ్రాస్)