KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేశారో అందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’...

KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

KGF2

KGF2: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేశారో అందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘కేజీయఫ్ చాప్టర్ 1’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలవగా.. దీనికి సీక్వెల్‌గా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ను చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇక ఈ సినిమా మొదట్నుండీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు.

KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు కొల్లగొడుతూ తన సత్తాను మరోసారి చూపిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్తాప్తంగా ఏకంగా రూ.546 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు మండే టెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. వారంలో మొదటి రోజైన సోమవారం నాడు సినిమాలు చూసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపరు. కానీ కేజీయఫ్ చాప్టర్ 2 విషయంలో అలా జరగలేదు.

KGF2: మూడు రోజుల్లో కేజీయఫ్2 సెన్సేషన్!

కేజీయఫ్ 2 చిత్రం నైజం ఏరియాలో మండే టెస్ట్‌లో అలవోకగా పాస్ అయ్యింది. వసూళ్లు ఎక్కవగా ఉండే నైజం ప్రాంతంలో సోమవారం నాడు కేజీయఫ్ చాప్టర్ 2 రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇవి డీసెంట్ వసూళ్లు కావడంతో ఇప్పటివరకు నైజాంలో ఏకంగా రూ.30.6 కోట్లు కలెక్ట్ చేసి తన సత్తా చాటింది. ఓ డబ్బింగ్ సినిమా రూ.30 కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం అంటున్నారు సినీ విశ్లేషకులు. యశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టిలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.