KGF2: మూడు రోజుల్లో కేజీయఫ్2 సెన్సేషన్!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం కేజీయఫ్2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సందడి చేస్తోంది. రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన....

KGF2: మూడు రోజుల్లో కేజీయఫ్2 సెన్సేషన్!

Kgf2

KGF2: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం కేజీయఫ్2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సందడి చేస్తోంది. రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు.

KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2

ఇక ఈ సినిమాలోని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలిరోజే ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు రావడమే దీనికి నిదర్శనంగా చెప్పుకువచ్చారు చిత్ర యూనిట్.

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

కాగా కేజీయఫ్ చిత్రం మూడు రోజుల్లోనే సరికొత్త సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్ చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.