KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

సినిమా చూసిన వాళ్లంతా ఆ ఎలివేషన్స్ కి సలాం రాకీ భాయ్ అంటున్నారు. ఇక కలెక్షన్లలోనూ ప్రభంజనం సృష్టిస్తుంది 'కేజిఎఫ్ 2' సినిమా. రెండో రోజు దేశం మొత్తంగా....................

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

Kgf

KGF2 Collections :  మూడు సంవత్సరాలుగా దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా ‘కేజిఎఫ్ 2’ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. రిలీజ్ రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకొని దూసుకుపోతుంది. సినిమాలోని అందరూ తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టేసారు. యశ్ మరోసారి తన స్టామినా చూపించాడు. సినిమా చూసిన వాళ్లంతా ఆ ఎలివేషన్స్ కి సలాం రాకీ భాయ్ అంటున్నారు. ఇక కలెక్షన్లలోనూ ప్రభంజనం సృష్టిస్తుంది ‘కేజిఎఫ్ 2’ సినిమా.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని రాబట్టింది. ఒక్క ఇండియాలోనే 134 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ లో అయితే పూర్తిగా డామినేట్ చేస్తుంది ‘కేజిఎఫ్ 2’. బాలీవుడ్ లో ‘కేజిఎఫ్ 2’ మొదటి రోజే 54 కోట్లు వసూలు చేసి హిందీ సినిమాలకి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలన్నిటిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 20 కోట్ల వరకు సాధించింది.

Acharya : నీ బాబునిరా నేను.. అక్కడ చూసుకుందాం.. చెర్రీకి ‘చిరు’ వార్నింగ్

ఇక రెండో రోజు మరింత కలెక్షన్ల వరద పారింది. దేశం మొత్తంగా 240 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించింది ‘కేజిఎఫ్ 2’. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించగా, హిందీలో 50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. కన్నడ సినిమా ఈ రేంజ్ లో భారీ విజయం సాధించి కలెక్షన్లని కొల్లగొడుతుంటే బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇక ఇవాళ రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు కూడా కలెక్షన్స్ అదిరిపోతాయి. ఈ రెండు రోజుల్లో మరో రెండొందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి ‘కేజిఎఫ్ 2’ కూడా 1000 కోట్లని టార్గెట్ పెట్టుకొని దూసుకెళ్తుంది.

View this post on Instagram

A post shared by Hombale Films (@hombalefilms)