Acharya : నీ బాబునిరా నేను.. అక్కడ చూసుకుందాం.. చెర్రీకి ‘చిరు’ వార్నింగ్

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా నుంచి భలే భలే బంజారా సాంగ్ ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా సాంగ్ రిలీజ్ అనౌన్సమెంట్ ని......

Acharya : నీ బాబునిరా నేను.. అక్కడ చూసుకుందాం.. చెర్రీకి ‘చిరు’ వార్నింగ్

Charan

Acharya :  కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరించాయి. పలు సార్లు వాయిదా పడిన ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది.

ఈ సినిమా నుంచి భలే భలే బంజారా సాంగ్ ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా సాంగ్ రిలీజ్ అనౌన్సమెంట్ ని వెరైటీగా ప్రమోట్ చేశారు చిరు, చరణ్, కొరటాల శివ. ఈ ప్రమోషన్ లో భాగంగా సాంగ్ అనౌన్సమెంట్ కి సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో కొరటాల శివ వచ్చి ఈ సాంగ్ చరణ్ కి, చిరు కి వినిపించి ఎలా ఉంది అని అడుగుతాడు.

Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్.. పవన్ అభిమానులు ఆగుతారా?

చిరు.. చరణ్ ఇటీవల నాటు నాటులో తారక్ తో కుమ్మేసాడు, చరణ్ లాంటి కుర్రాళ్లతో కలిసి నేను డ్యాన్స్ చేయగలనా అని ఆలోచిస్తున్నాను అని అన్నారు. ఇక చరణ్ మాట్లాడుతూ మేం ఎంత చేసినా మీరు వచ్చి ఒక్క స్టెప్ వేస్తే ఆ గ్రేస్ కి, ఎక్స్ప్రెషన్స్ కి మేమంతా అవుట్ అని అన్నారు. చాలా మంది మీరిద్దరూ కలిసి పూర్తి సాంగ్ కి డ్యాన్స్ వేస్తే చూడాలనుకుంటున్నారు అని శివ అనగా సురేఖ కూడా అదే కోరుకుంటుంది అని చిరంజీవి అన్నారు. ఇక కొరటాల శివ వెళ్లిపోయిన తర్వాత చిరు.. చరణ్ తో సాంగ్ లో నన్ను డామినేట్ చేద్దామనుకుంటున్నావా అంటే లేదు డాడీ అని చరణ్ అనగా, నేను నీ బాబుని రా అంటే.. డామినేట్ చేయను కానీ తగ్గను కూడా అని చరణ్ అనడంతో చిరు షాక్ అయ్యారు. మీ ట్రైనింగ్ నుంచి వచ్చాను తగ్గితే బాగోదు డాడీ అంటే చిరు సీరియస్ గా ఇక్కడెందుకు కబుర్లు కెమెరా ముందు అక్కడ చూసుకుందాం అని చరణ్ తో ఛాలెంజ్ చేశారు. ఇక చివర్లో వీరిద్దరూ కలిపి వేసిన ఒక స్టెప్ తో వీడియోని ముగించారు.

Chiranjeevi : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్?? అందుకోసమేనా??

ఈ వీడియో అంతా సరదాగా ప్రమోషన్ కోసమే చేశారు చిత్ర యూనిట్. గతంలో బంగారు కోడిపెట్ట సాంగ్ లో కొద్దీ సేపు చిరు, చరణ్ అలరించారు. ఇప్పుడు పూర్తి పాటకి చరణ్, చిరంజీవి కలిసి ‘ఆచార్య’ సినిమాలో డ్యాన్స్ వేయబోతున్నారు. అసలు టాలీవుడ్ లో డ్యాన్స్ అంటేనే చిరంజీవి, ఇక ఇప్పటి హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్లు లో చరణ్ ఒకరు, అందులోనూ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తే మెగా అభిమానులకి పండగే. దీంతో అభిమానులు ఈ సాంగ్ కోసం, సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.