Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్.. పవన్ అభిమానులు ఆగుతారా?

సాధారణంగానే పవన్ అభిమానులు వేరే హీరోల ఫంక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ గురించి అరుస్తారు. ఇక సొంత మెగా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చెప్పనవసరం లేదు. పవన్ కనపడినప్పుడల్లా సీఎం సీఎం అంటూ.......

Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్.. పవన్ అభిమానులు ఆగుతారా?

Pawan

Pawan Kalyan :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరించాయి. పలు సార్లు వాయిదా పడిన ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు చిత్రయూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్టు, దానికి ముఖ్య అతిధిగా ఏపీ సీఎం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

విజయవాడలో సిద్దార్థ కాలేజీలో కానీ, నాగార్జున యూనివర్సిటీ వద్ద కానీ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని, జగన్ ముఖ్య అతిధిగా రానున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు చిత్ర నిర్మాతలు. అయితే చిరంజీవి సినిమా ఫంక్షన్ కి జగన్ ముఖ్య అతిధిగా వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగుతారా అనే కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Chiranjeevi : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్?? అందుకోసమేనా??

ప్రస్తుతం ఏపీలో పవన్ పార్టీకి, జగన్ పార్టీకి అస్సలు పడట్లేదు. పవన్ కుదిరినప్పుడల్లా జగన్ పై, వారి పార్టీపై, ఏపీ ప్రభుత్వంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు, జనసేన ఫాలోవర్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. జనసేన ఫాలోవర్లు, పవన్ అభిమానులు జగన్ అంటేనే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరి పవర్ స్టార్ అన్నయ్య ఆచార్య సినిమా ఫంక్షన్ కి జగన్ ముఖ్య అతిగా వస్తే పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు. చిరంజీవి సినిమా ఫంక్షన్ అంటే మెగా అభిమానులంతా వచ్చే అవకాశం ఉంది, సినిమాలో రామ్ చరణ్ కూడా ఉండటంతో మరింత ఎక్కువగా మెగా, పవర్ అభిమానులు వస్తారు ఈవెంట్ కి.

KGF2: కేజీయఫ్2 రెండు రోజుల వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ భాయ్ హవా!

సాధారణంగానే పవన్ అభిమానులు వేరే హీరోల ఫంక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ గురించి అరుస్తారు. ఇక సొంత మెగా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చెప్పనవసరం లేదు. పవన్ కనపడినప్పుడల్లా సీఎం సీఎం అంటూ అరుస్తూనే ఉంటారు అభిమానులు. మరి ఈ ఫంక్షన్ కి జగన్ వస్తే కచ్చితంగా పవన్ అభిమానులు రెచ్చిపోతారు. పవన్ కి జిందాబాద్ లు కొట్టడమే కాకుండా పవన్ సీఎం, పవన్ సీఎం అని నినాదాలు చేసే అవకాశం కూడా ఉంది. అంతే కాక జనసేన జెండాలు కూడా తీసుకొస్తారు పవన్ అభిమానులు. వీటిని ఎవరూ ఆపలేరు. మరి వీటన్నిటిని చూస్తూ జగన్ రాగలరా? వచ్చి అక్కడ మాట్లాడగలరా? ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ వస్తే మాత్రం పవన్ అభిమానులు సభలో గందరగోళం చేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏమవుతుందో.