KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

శాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2' బ్లాక్‌బస్టర్‌ హిట్ సొంతం చేసుకుని మంచి రన్‌తో దూసుకుపోతోంది.

KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

Kgf2

KGF2: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ బ్లాక్‌బస్టర్‌ హిట్ సొంతం చేసుకుని మంచి రన్‌తో దూసుకుపోతోంది. ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌ 2 మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్‌కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది.

KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

ఈ సినిమాలోని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దెబ్బకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఏ భాషలో చూసినా కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. రాఖీ భాయ్ గత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు.

KGF2 : రెండు రోజుల్లో 240 కోట్లు.. అదరగొడుతున్న యశ్..

ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలిరోజే ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు రావడమే దీనికి నిదర్శనం కాగా.. నాలుగు రోజుల్లో ఒక్క హిందీలోనే రూ.193.99 కోట్ల వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటిన రాఖీ భాయ్ త్వరలోనే రూ.1000 కోట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డులను రాసుకుంటూ వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.